Milk Production: పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన భారత్. 2021లో 209.96 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో పాల ఉత్పత్తుల్లో భారత్ వాటా 21 శాతం. 2020-21 నాటికి తలసరి వినియోగం రోజుకు 427 గ్రాములు.
India ranks 1st in Global Milk Production
The Milk production increased from 17 MT in 1950-51 to 209.96 MT in 2020-21
?https://t.co/mZIXe5Kdsi#AmritYatra #AmritMahotsav pic.twitter.com/AIxVVwekcN
— PIB India (@PIB_India) August 27, 2022
అయితే పాల ఉత్పత్తిలో భారత్ ప్రపంచలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండటం గమనార్హం. గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్‌కు చెందిన రూ. 305 కోట్ల పాల ఉత్పత్తి ప్లాంట్‌ను సబర్‌కాంతలోని హిమ్మత్‌నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న సబర్ డెయిరీని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సబర్ డెయిరీ గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (GCMMF)లో భాగం. ఇది అమూల్ బ్రాండ్ కింద పాల ఉత్పత్తులను తయారు చేస్తుంది