Metro Rules Change: ఆ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం!

Metro Rules Change: దేశంలోని ముఖ్య నగరాల్లో మెట్రో మార్గంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. సిటీ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ లేకుండా మెట్రోలో సులభంగా ప్రయాణించగలుగుతున్నారు. ప్రయాణికుల కోసం మెట్రో సంస్థలు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆ మెట్రో ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది సంస్థ..

Metro Rules Change: ఆ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం!

Updated on: Jun 30, 2025 | 8:05 PM

గ్రీన్ లైన్‌లో పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ మెట్రో ఆపరేటింగ్ నియమాలను మార్చింది. సోమవారం నుండి శుక్రవారం వరకు మెట్రో రెండు లూప్‌లలో నడుస్తుంది. బ్రిగేడియర్ హోషియార్ సింగ్ స్టేషన్ నుండి కీర్తి నగర్ వరకు, అలాగే ముండ్కా నుండి ఇంద్రలోక్ వరకు. ప్రతి మెట్రో కీర్తి నగర్ నుండి బహదూర్‌గఢ్‌కు వెళ్తుంది. ఇంద్రలోక్‌కు వెళ్లేవారు అశోక్ పార్క్ స్టేషన్‌లో దిగి మెట్రోను మారుస్తారు. ఇది ప్రయాణంలో 17 సెకన్లు ఆదా చేస్తుంది. అలాగే రెండు అదనపు రైళ్లు నడుస్తాయి. ఈ కారిడార్‌లో మెట్రో ఫ్రీక్వెన్సీ పెరుగుతుందని, మెట్రో మునుపటి కంటే తక్కువ సమయంలో అందుబాటులో ఉంటుందని ఢిల్లీ మెట్రో చెబుతోంది.

Auto News: ఫుల్ ట్యాంక్‌తో 780 కి.మీ మైలేజీ.. అపాచీ, పల్సర్‌లతో పోటీ పడే బైక్‌!

గ్రీన్ లైన్‌లో అశోక్ పార్క్ మెయిన్ స్టేషన్, కీర్తి నగర్ మధ్య ప్రత్యేక లూప్ లైన్ ఉంది. గ్రీన్ లైన్‌లో ప్రతిరోజూ 20 రైళ్లు నడుస్తాయి. రద్దీ సమయాల్లో కూడా ఈ కారిడార్‌లో నాలుగు నిమిషాల పది సెకన్ల నుండి ఎనిమిది నిమిషాల 20 సెకన్ల వ్యవధిలో రైళ్లు అందుబాటులో ఉంటాయి. కీర్తి నగర్ నుండి నడిచే ప్రతి రెండవ రైలు బహదూర్‌గఢ్‌లోని బ్రిగేడియర్ హోషియార్ సింగ్ మెట్రో స్టేషన్‌కు వెళుతుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Holiday: జూలై 7న ప్రభుత్వ సెలవు ఉంటుందా..? విద్యార్థులకు రెండు రోజులు హాలిడే ఉంటుందా?

ఇంద్రలోక్ నుండి బహదూర్‌గఢ్ వెళ్లడానికి ప్రయాణికులు రాజధాని పార్క్ స్టేషన్‌లో దిగి బహదూర్‌గఢ్ మెట్రోను ఎక్కగలుగుతారు. ఇది ప్రతి మెట్రో ప్రయాణంలో 17 సెకన్ల సమయం ఆదా చేస్తుంది. దీని వలన రోజంతా గ్రీన్ లైన్‌లో రెండు అదనపు మెట్రో రైళ్లు నడపడానికి వీలు కలుగుతుంది. ప్రయాణికుల నుండి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా, బహదూర్‌గఢ్- కీర్తి నగర్ ఇండస్ట్రియల్ ఏరియా మధ్య మెరుగైన ట్రాఫిక్ కోసం ఈ చర్య తీసుకుంది. మెట్రో మునుపటిలాగే శని, ఆదివారాల్లో నడుస్తుంది.

ఇది కూడా చదవండి: Monthly Horoscope: ఈ రాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతోందో తెలుసా? కుటుంబంలో విభేదాలు, అధిక ఖర్చులు

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి