AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Masqati Dairy: ఇంట్లో వాడగా మిగిలిన పాల అమ్మకంతో మొదలై.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యమైంది!

ఇబ్రహీం మస్కటీ తన కూతురి కోసం రెండు గేదెలతో ప్రారంభించిన మస్కటీ డెయిరీ హైదరాబాద్‌లోని ఓ పెద్ద పాల వ్యాపార సామ్రాజ్యంగా ఎలా మారిందో ఈ కథ వివరిస్తుంది. 1962లో స్థాపించబడిన ఈ సంస్థ, నాణ్యమైన పాలు అందిస్తూ, స్థానిక రైతులను కూడా ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరుగురు కుమారులు దీనిని విజయవంతంగా నడుపుతున్నారు.

Masqati Dairy: ఇంట్లో వాడగా మిగిలిన పాల అమ్మకంతో మొదలై.. వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యమైంది!
Masqati Dairy
SN Pasha
|

Updated on: Jun 15, 2026 | 4:11 PM

Share

హైదరాబాద్‌లోని పాతబస్తీకి చెందిన ఇబ్రహీం మస్కటీ అనే వ్యక్తి.. తన కూతురికి పాలు కావాలని ఓ రెండు గేదెలను కొనుగోలు చేశాడు. మంచి వాటి పాలు పతికి తన కూతురికి తాగిస్తూ.. ఇంట్లోకి కూడా వాడుకున్నాడు. అయితే ఇంట్లో అన్ని అవసరాలకు వాడుకోగా.. అప్పుడప్పుడు పాలు మిగిలేవి. వాటిని ఏం చేయాలో తెలియక.. ఓ రోజు ఇంటి ముందు ఓ బల్లా మీద ఆ పాలు పెట్టుకొని అమ్మకానికి కూర్చున్నాడు. ఓ రెండు లీటర్ల పాలు అమ్మాడు. పాలకు మంచి గిరాకీ ఉండటంతో.. అలా అలా.. రెండు గేదెలు నాలుగు అయ్యాయి.. నాలుగు నలభై అయ్యాయి. మొత్తంగా మస్కటీ డెయిర్ అని ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యమే ఏర్పడింది.

వింటుంటే.. ఒక కథలా ఉన్నా ఇది నిజంగానే జరిగింది. హైదరాబాద్, తెలంగాణలో ఎంతో పేరున్న మస్కతి పాల డెయిరీ వెనుకున్న అసలు కథ ఇది. ఇబ్రహీం బిన్ అబ్దుల్లా మస్కటీ స్థాపించిన మస్కటీ డెయిరీ 1962లో ప్రారంభమైంది. ఇప్పటికీ అదే బ్రాండ్ వ్యాల్యూతో భారీ లాభాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఇబ్రహీం ఆరుగురు కుమారులు ఈ డెయిరీని రన్ చేస్తున్నారు. అన్నదమ్ముల అనుబంధంతో పాటు వ్యాపారాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారు. మోసిన్ బిన్ ఇబ్రహీం మస్కటీ, సుల్తాన్ బిన్ ఇబ్రహీం మస్కటీ, అలీ బిన్ ఇబ్రహీం మస్కటీ, మొహమ్మద్ బిన్ ఇబ్రహీం మస్కటీ, ఖాలిద్ బిన్ ఇబ్రహీం మస్కటీ, ఆదిల్ బిన్ ఇబ్రహీం బిన్ మస్కటీ అనే అన్నదమ్ములు ఈ డెయిరీకి డైరెక్టర్లుగా ఉన్నారు.

2019లో ఈ డెయిరీని లిస్టెడ్ కంపెనీగా మార్చారు. కార్పొరేట్ రికార్డుల ప్రకారం.. మస్కతి డెయిర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థ 2019 నవంబర్ 29న అధికారికంగా నమోదైంది. హైదరాబాద్‌లోని చార్మినార్ సమీపంలోని కొట్లా అలీజా ప్రాంతంలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. పాలు సేకరణ, ప్రాసెసింగ్, పంపిణీ కోసం ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేసి నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో సేవలు అందిస్తోంది. నాణ్యమైన పాల ఉత్పత్తులను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న మస్కటీ డెయిరీ, స్థానిక రైతుల నుంచి పాలు సేకరించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు అందిస్తోంది. డెయిరీ రంగంలో పెరుగుతున్న పోటీ మధ్య హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రైవేట్ డెయిరీ బ్రాండ్లలో ఒకటిగా మస్కటీ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us