AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mallishwari Movie: వారెవ్వా.. మల్లీశ్వరీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయిందో చూశారా.. ? హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్..

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో మల్లీశ్వరీ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా వెంకటేశ్, బ్రహ్మానందం, సునీల్ కామెడీ టైమింగ్ ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికీ ఈ సినిమా వస్తే టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ చిత్రంలో వెంకీ అన్న కూతురిగా కనిపించిన ఆ చిన్నారి గుర్తుందా.. ? అమాయకత్వమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిన్నారి లేటేస్ట్ లుక్ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jun 15, 2026 | 4:13 PM

Share
తెలుగు సినీ పరిశ్రమలో బాలనటులుగా అలరించి, ఆ తర్వాత కాలంలో ఎంతోమంది హీరోయిన్లుగా మారి తమదైన ముద్ర వేసుకున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న పేరు 'గ్రీష్మ నేత్రిక'. ఒకప్పుడు ఎంతోమంది అగ్రనటుల చిత్రాల్లో బాలనటిగా అల్లరి చేసిన గ్రీష్మ, ఇప్పుడు అద్భుతమైన మార్పుతో నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. 'మల్లీశ్వరి' వంటి క్లాసిక్ సినిమాల్లో బాలనటిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించిన గ్రీష్మ, తన చిలిపి నటనతో ప్రేక్షకులను అలరించింది. కేవలం మల్లీశ్వరి మాత్రమే కాకుండా 'అమ్ములు', 'అశోక్', 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం', 'ప్రస్థానం', 'పంచాక్షరి', 'ఏమో గుర్రం ఎగరవచ్చు' వంటి పలు చిత్రాల్లో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా మెప్పించింది. ఆ సినిమాల్లో ఆమె కనిపించిన తీరు, అభినయం ఇప్పటికీ చాలామందికి గుర్తే.

1 / 5
 ప్రస్తుతం గ్రీష్మ నేత్రిక సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. అప్పటి చిన్నారి గ్రీష్మ, ఇప్పుడు ఎంతో అందంగా, స్టైలిష్‌గా మారిపోవడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె గ్లామరస్ ఫోటోషూట్స్ చూస్తుంటే, త్వరలోనే ఆమె హీరోయిన్‌గా వెండితెరపై సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని అర్థమవుతోంది. ఆమె స్టైలింగ్, ఫోటోల్లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే, గ్లామర్ ఇండస్ట్రీలో రాణించేందుకు కావాల్సిన లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

2 / 5
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అందుకున్న గ్రీష్మ, ఇప్పుడు హీరోయిన్‌గా కూడా నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తన తాజా ఫోటోలతో గ్లామర్ ప్రపంచానికి తాను సిద్ధమేనని సంకేతాలు ఇస్తోంది. ఆమె సోషల్ మీడియా పోస్టులకు అభిమానుల నుంచి, నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇంతగా మారిపోవడంతో అభిమానులు ఆమె కొత్త ప్రాజెక్టుల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి గ్రీష్మ హీరోయిన్‌గా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఎలా మొదలుపెడుతుందో చూడాలి!

3 / 5
చైల్డ్ ఆర్టిస్ట్‌గా దాదాపు 30కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె, ప్రస్తుతం హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సినిమాల్లో నటిస్తూనే గ్రీష్మ తన చదువును విజయవంతంగా పూర్తి చేశారు.  నటనతో పాటు ఆమె క్లాసికల్ డ్యాన్స్ (కూచిపూడి) కూడా నేర్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చూసిన ప్రేక్షకులు, తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అప్పటి చిన్నారి గ్రీష్మ ఇప్పుడు ఎంతో స్టైలిష్‌గా, గ్లామరస్‌గా మారిపోయారు.

4 / 5
ఆమె మూడు ఏళ్ల ప్రాయంలోనే 'అమ్ములు' అనే చిత్రంతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. నందమూరి బాలకృష్ణ నటించిన 'ఎన్టీఆర్: మహానాయకుడు' చిత్రంలో యువ బసవతారకం పాత్రను పోషించి మెప్పించింది.  నటనతో పాటు స్క్రిప్ట్ రైటింగ్ , స్టోరీ టెల్లింగ్ పట్ల కూడా ఈమెకు ఆసక్తి ఉంది. ప్రస్తుతం గ్రీష్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us