AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snakes: పాములు నాలుకను పదే పదే బయటకు ఎందుకు తీస్తాయో తెలుసా? అసలు కారణం ఇదేనట!

చాలా మంది పాములను చూస్తే భయపడిపోతూ ఉంటారు. కానీ వాటి గురించి చెప్తే మాత్రం చాలా ఆసక్తిగా వింటారు. మీరు కూడా అదే కోవకు చెందిన వారైతే ఈ వార్త మీకోసమే! ఇవాళ పాముల గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మేము మీకు చెప్పబోతున్నాం. దాన్ని తెలుసుకునేందుకు మీరు సిద్ధంగా ఉంటే ఈ పూర్తి స్టోరీ చదవండి.

Snakes: పాములు నాలుకను పదే పదే బయటకు ఎందుకు తీస్తాయో తెలుసా? అసలు కారణం ఇదేనట!
Why Do Snakes Stick Their Tongue Out
Anand T
|

Updated on: Jun 15, 2026 | 4:11 PM

Share

మన దైనందిన జీవితంలో ఒక్కసారైనా మనం పాములను చూసే ఉంటాం. ఎందుకంటే పాములు కూడా మనం నివసించే పరిసరాల్లోనే కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా పాములను చూస్తే చాలా మంది భయపడతారు. అవి ఎక్కడ కాటేసి.. ప్రాణాలు తీస్తాయో అని దూరంగా ఉంటారు. అయితే పాములు వాటికి హాని జరుగుతుంది అనుకుంటే మాత్రమే, అదీ వాటి ఆత్మరక్షణ కోసం మాత్రమే దాడి చేస్తాయి. లేదంటే వాటి దారిన అవి వెళ్తాయి.

అయితే మీరు పాములను సరిగ్గా గమనిస్తే అవి తరచూ వాటి నాలుకను బయటకు తీస్తూ ఉంటాయి. అలా ఎందుకు మళ్లీ మళ్లీ పాములు నాలుక బయటపెడతాయని మీరెప్పుడైనా ఆలోచించారా? చాలా మంది కోపంగా ఉన్నప్పుడు పాములు ఇలా చేస్తాయి అనుకుంటారు. కానీ దీని వెనుక ఒక విభిన్నమైన శాస్త్రీయ కారణం ఉంది. అవును, పాములు మిగతా అన్ని జీవుల కన్నా భిన్నంగా ఉంటాయి. పాములకు వాటి నాలుక ఒక ప్రత్యేక సెన్సార్‌లా పనిచేస్తుంది. ఈ నాలుకను ఉపయోగించే అవి తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అంచనా వేయడం, ఆహారాన్ని వెతకడం చేస్తాయి.

పాము నాలుక ఎలా పనిచేస్తుంది?

ఇవి కూడా చదవండి

పాము తన నాలుకను బయటకు తెచ్చినప్పుడు, గాలిలోని సూక్ష్మ కణాలు దాని నాలుకకు అంటుకుంటాయి. మళ్లీ నాలుకను లోపలికి తీసుకున్నప్పుడు.. దానిపై ఉన్న కణాలు పాము నోటి పైభాగంలో ఉన్న ఒక ప్రత్యేక అవయవాన్ని చేరుకుంటాయి. ఈ అవయవాన్ని శాస్త్రీయంగా ‘జాకబ్సన్ అవయవం లేదా ‘వోమెరోనాసల్’ అని అంటారు. ఇది ఆ కణాలను విశ్లేషించి మెదడుకు ఒక సంకేతాన్ని పంపుతుంది. అలా వచ్చే సిగ్నల్స్ బట్టి పాము వెంటనే అలర్ట్ అయి శత్రువుల బారి నుంచి తప్పించుకుంటుంది.

ఒకవేళ నాలుక లేకపోతే..

పాము తన చుట్టూ ఉన్న పరిసరాలను అంచనా వేయడానికి తన నాలుకనే వాడుతుంది. ఎందుకంటే వాటికి మనలా ముక్కు, చెవులు ఉండవు . కాబట్టి అది పూర్తిగా తన నాలుకపైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పాము తన నాలుకను బయటకు చాచడం ఆపేస్తే, అది తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, వచ్చే ప్రమాదాలను అంచనా వేయలేదు. అంతేకాదు.. తన దారిని, ఆహారాన్ని కనుక్కోలేదు. అందుకే పాములు నిరంతరం తమ tongue (నాలుక)ను లోపలికి, బయటికి పెడుతూ కనిపిస్తాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మల్లీశ్వరీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత అందంగా ఉందో చూశారా.. ?
మల్లీశ్వరీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత అందంగా ఉందో చూశారా.. ?
పాములు నాలుకను పదే పదే బయటకు ఎందుకు తీస్తాయో తెలుసా?
పాములు నాలుకను పదే పదే బయటకు ఎందుకు తీస్తాయో తెలుసా?
బఠానీలు, పప్పులు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే పానీపూరి చాట్..
బఠానీలు, పప్పులు లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే పానీపూరి చాట్..
వెల్‌కమ్‌ గర్ల్ నుండి కోట్లు తీసుకునే స్టార్‌ వరకు..
వెల్‌కమ్‌ గర్ల్ నుండి కోట్లు తీసుకునే స్టార్‌ వరకు..
వర్షాల దేవుడిగా పూజలు అందుకుంటున్న మహాభారత వీరుడు! కమ్రూ నాగ్ ఆలయ
వర్షాల దేవుడిగా పూజలు అందుకుంటున్న మహాభారత వీరుడు! కమ్రూ నాగ్ ఆలయ
మెట్రో ఫేజ్-2కు కేంద్రం బ్రేకులు.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు!
మెట్రో ఫేజ్-2కు కేంద్రం బ్రేకులు.. సీఎం రేవంత్ సంచలన ఆరోపణలు!
నా కెరీర్‌ను ముందే ఊహించిన హీరో ఆయన...
నా కెరీర్‌ను ముందే ఊహించిన హీరో ఆయన...
జుట్టుకునూనె ఎప్పుడు,ఎలా పెట్టాలి?హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్
జుట్టుకునూనె ఎప్పుడు,ఎలా పెట్టాలి?హెయిర్ ఎక్స్‌పర్ట్ జావేద్ హబీబ్
వాడికి మొహం మీదే ఇచ్చి పడేశా: శ్రవంతి
వాడికి మొహం మీదే ఇచ్చి పడేశా: శ్రవంతి
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్..ఈ జిల్లాల్లో మరో 3రోజులు వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్..ఈ జిల్లాల్లో మరో 3రోజులు వర్షాలు