Maruti Suzuki eVX: మరోసారి క్లిక్‌.. మళ్లీ కనిపించిన మారుతి సుజుకీ ఈ-కార్‌.. ఇంతకీ లాంచింగ్ ఎప్పుడో?

భారతదేశంలో టాప్‌ కార్ల తయారీదారైన మారుతి సుజుకీ మాత్రం ఇంకా తన మొదటి ఎలక్ట్రిక్‌ కారును ఇంకా లాంచ్‌ చేయలేదు. అయితే తన మొదటి ఎలక్ట్రిక్‌ కారును మారుతి సుజుకీ ఈవీఎక్స్‌(eVX) పేరుతో తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించినా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే పలు దఫాలుగా ఈ కారును పరీక్షిస్తున్న సమయంలో చాలా మంది కంట ఈ కారు పడింది. తాజాగా గురుగ్రామ్‌ సమీపంలో ఈ ఈవీఎక్స్‌ కారు కనిపించింది.

Maruti Suzuki eVX: మరోసారి క్లిక్‌.. మళ్లీ కనిపించిన మారుతి సుజుకీ ఈ-కార్‌.. ఇంతకీ లాంచింగ్ ఎప్పుడో?
Maruti Suzuki Evx
Follow us
Madhu

|

Updated on: Jun 25, 2024 | 12:44 PM

మన దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కేవలం ద్విచక్ర వాహనాలే కాకుండా కార్లు, ఆటోలు కూడా వేగంగా ఎలక్ట్రిక్‌ బాట పడుతున్నాయి. ముఖ్యంగా కార్ల విషయంలో టాప్‌ కంపెనీలు అయిన టాటా, ఎంజీ, బీవైడీ వంటివి తమ ఉత్పత్తులను మార్కెట్లో అందుబాటులో ఉంచాయి. అయితే భారతదేశంలో టాప్‌ కార్ల తయారీదారైన మారుతి సుజుకీ మాత్రం ఇంకా తన మొదటి ఎలక్ట్రిక్‌ కారును ఇంకా లాంచ్‌ చేయలేదు. అయితే తన మొదటి ఎలక్ట్రిక్‌ కారును మారుతి సుజుకీ ఈవీఎక్స్‌(eVX) పేరుతో తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించినా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. అయితే పలు దఫాలుగా ఈ కారును పరీక్షిస్తున్న సమయంలో చాలా మంది కంట ఈ కారు పడింది. తాజాగా గురుగ్రామ్‌ సమీపంలో ఈ ఈవీఎక్స్‌ కారు కనిపించింది. అందులో ఆరుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు కూడా పలువురు గుర్తించారు. కాగా ఈ సందర్భంగా ఆ కారు వివరాలు చూస్తే స్టన్నింగ్‌గా ఉన్నాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంపాక్ట్‌ సైజులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ కారును వచ్చే ఏడాది మార్కెట్లోకి లాంచ్‌ అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

సోషల్‌ మీడియాలో వైరల్‌..

మారుతి సుజుకీ ఈవీఎక్స్‌ను పరీక్షిస్తున్న సమయంలో తీసిన ఫొటోలు పలువురు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. స్పై షాట్‌గా వీటిని చూపించారు. అయితే ఈ కారును ఇంతకు ముందు పరీక్షల సమయంలో చూసిన దాని కంటే భిన్నమైన అల్లాయ్‌ వీల్ డిజైన్‌ను కలిగి ఉందని చెబుతున్నారు. కెమెరాలో క్యాప్చర్ చేయబడిన టెస్ట్ మ్యూల్ మునుపటి టెస్ట్ యూనిట్లతో కనిపించే 10-స్పోక్ అల్లాయ్లా మాదిరిగా కాకుండా ఐదు-స్పోక్ అల్లాయ్ వీల్ డిజైన్తో కనిపిస్తోంది. చక్రాల పరిమాణం 16 అంగుళాలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. పాత తరం స్విఫ్ట్ లాగా ఈవీఎక్స్‌ వెనుక డోర్ హ్యాండిల్స్‌ను సి-పిల్లర్ పై అమర్చే అవకాశం ఉందని స్పై షాట్లు వెల్లడిస్తున్నాయి. ఇది మునుపటి టెస్ట్ యూనిట్లలో కూడా కనిపించింది.

మారుతి సుజుకి ఈవీఎక్స్‌ డిజైన్..

మారుతి సుజుకి ఈవీఎక్స్‌ ఎల్‌ఈడీ హెడ్లైట్, డీఆర్‌ఎల్‌ యూనిట్లు, ఎల్‌ఈడీ లైట్బార్, హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, రియర్ స్పాయిలర్ అలాగే షార్క్-ఫిన్ యాంటెన్నా వంటి ఇతర ఎక్స్‌టీరియర్‌ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి తమ మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కేట్బోర్డ్ ప్లాట్ఫారమ్ పై నిర్మించనున్నట్లు గతంలోనే తెలిపింది. బ్యాటరీ పరిమాణం దాదాపు 60కేడబ్ల్యూహెచ్‌ ఉంటుందని అంచనా. మారుతి ఈవీఎక్స్‌ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 550 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని చెబుత్నుఆరు

మారుతి సుజుకి ఈవీఎక్స్‌ ఫీచర్స్‌..

మారుతి సుజుకి గత సంవత్సరం అప్‌డేట్‌ చేసిన కాన్సెప్ట్ వెర్షన్ షోకేస్ సందర్భంగా ఈవీఎక్స్‌ లోపలి భాగం ఎలా ఉంటుందో కూడా వెల్లడించింది. ఇది ఊహించిన అన్ని ఆధునిక సౌకర్యాలతో సరళమైన ఇంకా భవిష్యత్ ఇంటీరియర్ డిజైన్ ఈవీఎక్స్‌ని చూపుతుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లేకి అనుకూలమైన పెద్ద టస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, ఫ్రంట్-వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ సర్దుబాటు, ఆటో-డిమ్మింగ్ ఐఆర్పిఎం వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్