Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి
Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం..

Employees: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ఉద్యోగులకు డీఏ పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉద్యోగులకు ఈ డీఏ పెంపు నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. డియర్‌నెస్ అలవెన్స్‌లో మూడు శాతం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఉద్యోగులకు ఈ పెంపు ఉంటుంది.
రాష్ట్రంలో కరువు భత్యం ఎంత?
మధ్యప్రదేశ్ ప్రభుత్వ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, ఇతర ఉద్యోగులకు ఇప్పటి వరకు 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్ (DA) పొందుతారు. అయితే ఇప్పుడు పెంపు నిర్ణయం తర్వాత అది 34 శాతానికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రకటనతో 30 వేల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ పెరిగిన డీఏ ఆగస్టు 1 నుంచి వర్తిస్తుంది. ఎన్నికల ముందు ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. డీఏ పెంపు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అయితే ప్రభుత్వ ఈ ప్రకటన తర్వాత రాష్ట్ర బడ్జెట్‌పై పెను ప్రభావం చూపనుంది.




ముఖ్యమంత్రి గతంలో కూడా ప్రకటించారు
ఇంతకుముందు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచారు. వారికి డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెంచారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 7.5 లక్షల మంది నేరుగా లబ్ధి పొందనున్నారు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏను 34 శాతం నుంచి 38 శాతానికి పెంచుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. మరికొద్ది వారాల్లో కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




