
దేశవ్యాప్తంగా ఉన్న ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం, గ్యాస్ పంపిణీ సంస్థలు కీలక అలర్ట్ జారీ చేశాయి. సాధారణ ఎల్పీజీ సిలిండర్ వాడుతున్న వారైనా లేదా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద రాయితీ పొందుతున్న వారైనా… వెంటనే అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ఒక చిన్న పని పూర్తి చేయకపోతే, మీ గ్యాస్ సబ్సిడీ శాశ్వతంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు మీ గ్యాస్ సిలిండర్ బుకింగ్ సేవలకు కూడా అంతరాయం కలగవచ్చు. గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని కొనసాగించడానికి ఇ-కేవైసీని తప్పనిసరి చేసినట్లు ఎల్పీజీ పంపిణీదారులు స్పష్టం చేశారు. నకిలీ కనెక్షన్లను అరికట్టడానికి, అర్హులైన వారికే సబ్సిడీ అందించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మీ ఇ-కేవైసీ ని అప్‌డేట్ చేయడానికి జూన్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. కాబట్టి వినియోగదారులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా, అంతకంటే ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం ఉత్తమం.
ఈ మండుటెండల్లో ఇ-కేవైసీ కోసం గ్యాస్ ఆఫీసుల చుట్టూ, బ్యాంకులు లేదా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ద్వారా ఇంటి నుంచే కేవలం 5 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఒకవేళ మీ గ్యాస్ కంపెనీకి ప్రత్యేక యాప్ లేకపోయినా, లేదా అందులో సాంకేతిక సమస్యలు వచ్చినా ప్రభుత్వ అధికారిక ఉమాంగ్ యాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు:
ఆన్‌లైన్‌లో ఇ-కేవైసీ చేసేటప్పుడు ఫేస్ అథెంటికేషన్ కోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి ప్రభుత్వ అధికారిక AadhaarFaceRd యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ లేకపోతే మాత్రం, మీరు నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ద్వారా ఇ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. సబ్సిడీ సొమ్మును కోల్పోకుండా ఉండాలంటే వెంటనే మీ మొబైల్‌లో ఈ రోజే ఇ-కేవైసీ స్టేటస్ చెక్ చేసుకోండి.