LPG Cylinder Price: అద్భుతమైన ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 డిస్కౌంట్‌.. వెంటనే బుక్‌ చేసుకోండి!

|

Sep 13, 2022 | 5:33 PM

LPG Cylinder Price: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మండిపోతున్నాయి. ప్రతి నెల 1వ తేదీన ధర పెరిగిపోతోంది. ఇక గృహ వినియోగానికి కొత్త గ్యాస్ సిలిండర్ పొందాలనుకుంటే..

LPG Cylinder Price: అద్భుతమైన ఆఫర్‌.. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.300 డిస్కౌంట్‌.. వెంటనే బుక్‌ చేసుకోండి!
Lpg Cylinder Price
Follow us on

LPG Cylinder Price: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు మండిపోతున్నాయి. ప్రతి నెల 1వ తేదీన ధర పెరిగిపోతోంది. ఇక గృహ వినియోగానికి కొత్త గ్యాస్ సిలిండర్ పొందాలనుకుంటే తక్కువ ధరల్లో కూడా అందుబాటులో ఉంది. ఈ గృహ గ్యాస్ సిలిండర్‌ను కొనుగోలు చేస్తే రూ.300 వరకు ఆదా పొందవచ్చు. ఇందుకోసం గ్యాస్ పంపిణీకి అనుబంధంగా ఉన్న ప్రభుత్వ సంస్థ ఇండేన్ తక్కువ ధరలకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు శ్రీకారం చుట్టింది. 10 కిలోలు బరువున్న కంపోజిట్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.750లకు లభిస్తోంది. అంటే గృహ సిలిండర్‌ కంటే రూ.300ల వరకు తక్కువ ధరల్లో లభించనుంది.

ఈ సిలిండర్‌లోని ప్రత్యేకత ఏమిటంటే మీరు దానిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తీసుకెళ్లవచ్చు.ఈ సిలిండర్ బరువు సాధారణ సిలిండర్ కంటే తక్కువగా ఉంటుంది. ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర రూ.1053 ఉంది. మీరు ఈ సిలిండర్‌పై రూ.300 వకు ఆదా చేసుకోవడం వల్ల పెద్ద ఉపశమనం పొందవచ్చు.

తక్కువ ధరకే ఎందుకు..?

ఇవి కూడా చదవండి

సాధారణ సిలిండర్ల కంటే మిశ్రమ సిలిండర్లు తక్కువ బరువు కలిగి ఉంటాయి. ఇందులో 10 కిలోల గ్యాస్ లభిస్తుంది. దీని కారణంగా దాని ధర తక్కువగా ఉంటుంది. ఈ సిలిండర్ ప్రత్యేకత ఏమిటంటే అవి పారదర్శకంగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సిలిండర్లు 28కి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇతర నగరాల్లోనూ ఈ సిలిండర్లను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ పరిశీలిస్తోంది. ఈ సిలిండర్‌ను స్మార్ట్ సిలిండర్ అని కూడా పిలుస్తారు. అయితే మీమీ నగరాల్లో ఉంటే తక్కువ ధరల్లో పొందే అవకాశం ఉంటుంది.

ఈ సిలిండర్ ప్రత్యేకత ఏమిటి?

ఈ సిలిండర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఎంత గ్యాస్‌ను వాడామన్నది సులభంగా తెలుసుకునే సదుపాయం ఉంది. గ్యాస్ ఏజెన్సీ మీకు తక్కువ గ్యాస్ ఇవ్వదు. కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు ఎవరైనా కాంపోజిట్ సిలిండర్ తీసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, మీకు కావాలంటే మీరు సాధారణ సిలిండర్ నుండి కాంపోజిట్ సిలిండర్‌కు మారవచ్చు. మీరు సాధారణ సిలిండర్‌ను తిరిగి ఇవ్వాలి అప్పుడు మీకు దానికి బదులుగా కొత్త కంపోజిట్‌ సిలిండర్ జారీ చేయబడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..