
ఏ చిన్న అవసరం వచ్చినా లోన్ తీసుకోవడం ఈ కాలంలో కామన్ అయిపోయింది. హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు.. ఇలా పలు రకాల రుణాలు మన జీవితంలో భాగమయ్యాయి. అయితే ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే.. ఆ అప్పు మాఫీ అవుతుందా? లేక కుటుంబ సభ్యులు చెల్లించాల్సి వస్తుందా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బకాయిలు వంటివి అన్‌సెక్యూర్డ్ లోన్స్ జాబితాలోకి వస్తాయి. అంటే ఈ రుణాలకు హామీగా ఎలాంటి ఆస్తి ఉండదు. లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఈ రుణం చెల్లించమని బ్యాంకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను లేదా గ్యారంటర్‌ను బలవంతం చేయదు. ఇవి అన్‌సెక్యూర్డ్ రుణాలు కాబ, రుణగ్రహీత మరణానంతరం బ్యాంకులు సాధారణంగా వీటిని రికవరీ చేయలేవు. ఈ బకాయిలు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది.
హోమ్ లోన్స్ సెక్యూర్డ్ రుణాల కిందకు వస్తాయి. ఎందుకంటే ఇంటి ఆస్తిని హామీగా పెట్టి ఈ రుణాలు తీసుకుంటారు. సాధారణంగా హోమ్ లోన్‌కు అప్లికెంట్‌తో పాటు కో-అప్లికెంట్ ఉంటారు. ప్రధాన రుణగ్రహీత మరణిస్తే, లోన్ తిరిగి చెల్లించే పూర్తి బాధ్యత కో-అప్లికెంట్‌పై పడుతుంది. కో-అప్లికెంట్ వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. అప్పుడు లోన్‌ను మరణించిన వ్యక్తి పేరుపై నుంచి తొలగించి, కో-అప్లికెంట్ పేరు మీదకు బదిలీ చేస్తారు. ఒకవేళ కో-అప్లికెంట్ బకాయిలు చెల్లించలేకపోతే, ఆ ఆస్తిని స్వాధీనం చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది.
లోన్ తీసుకున్న మరణించినప్పుడు కుటుంబానికి ఆర్థిక భారం తగ్గించడానికి లోన్ ఇన్సూరెన్స్ కవర్ చాలా ఉపయోగపడుతుంది. చాలా బ్యాంకులు హోమ్ లోన్ తీసుకునేటప్పుడే ఈ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ను అందిస్తాయి. రుణగ్రహీత మరణిస్తే, ఇన్సూరెన్స్ కంపెనీ మిగిలిన లోన్ బకాయిలను చెల్లిస్తుంది. దీనివల్ల కో-అప్లికెంట్ లేదా కుటుంబ సభ్యులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. పర్సనల్ లోన్స్ విషయంలో ఇలాంటి ఇన్సూరెన్స్ కవర్ ఆప్షన్లు తక్కువగా ఉంటాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కవర్ గురించి తెలుసుకోవడం దాన్ని ఎంచుకోవడం తెలివైన పని.
లోన్ తీసుకున్న వ్యక్తి మరణించినప్పుడు అది సెక్యూర్డ్ లోనా లేక అన్‌సెక్యూర్డ్ లోనా అనే దానిపైనే నిబంధనలు ఆధారపడి ఉంటాయి. భవిష్యత్తులో కుటుంబ సభ్యులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే రుణగ్రహీతలు ఈ నిబంధనలను ముందుగానే తెలుసుకోవడం, సరైన ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకోవడం అత్యంత ముఖ్యం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి