
ప్రస్తుతం బంగారం ధర రూ. 1.20 లక్షలు(10 గ్రాములకు) దాటింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఇదే మంచి సమయం. దీపావళి సందర్భంగా గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ చేద్దామనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్ లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈటీఎఫ్ అంటే ఎక్స్ ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అని అర్థం. బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఇవి సులభమైన, సురక్షితమైన ఆప్షన్స్. ఇవి బంగారం ధరలకు అనుగుణంగా మారుతుంటాయి. కాబట్టి బంగారం విలువ పెరిగే కొద్దీ వీటి విలువ కూడా పెరుగుతుంది. తద్వారా మీరు సులభంగా ప్రాఫిట్స్ గెయిన్ చేయొచ్చు.
మీరు స్టాక్‌లను కొనుగోలు చేసినట్లే స్టాక్ మార్కెట్‌లో గోల్డ్ ఈటీఎఫ్ లు కొనుగోలు చేయొచ్చు అలాగే అమ్మొచ్చు కూడా. అంతేకాకుండా ఈటీఎఫ్ ల ద్వారా మీరు చిన్న మొత్తాలతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించొచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఉన్నా కూడా బంగారం విలువ స్థిరంగా ఉంటుంది కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్ లు ఎప్పుడూ సేఫ్ ఆప్షన్ గానే చెప్పుకోవచ్చు. ఇకపోతే 2025 లో పెట్టుబడి పెట్టడానికి 5 బెస్ట్ గోల్డ్ ఈటిఎఫ్‌ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
పైన లిస్ట్ ను బట్టి చూస్తే.. గోల్డ్ ఈటీఎఫ్ లు స్థిరంగా 50% కంటే ఎక్కువ రాబడిని అందించాయి. మూడేళ్లు దాటితే 100% రాబడిని ఇస్తున్నాయి. కాబట్టి గోల్డ్ ఈటీఎఫ్ లలో ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఆప్షన్ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి పెట్టుబడుల కిందకు వస్తాయి. అంటే పరిస్థితులను బట్టి వాల్యూ తగ్గే అవకాశం కూడా ఉండొచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి