Life Insurance: జీవిత బీమా పాలసీ కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి..

|

Oct 27, 2022 | 10:01 PM

కోవిడ్-19 తర్వాత.. చాలా మంది జీవితా బీమాను తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కరోనా వైరస్ దేశంలో లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది.

Life Insurance: జీవిత బీమా పాలసీ కొనుగోలు చేస్తున్నారా? ఈ తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి..
Life Insurance
Follow us on

కోవిడ్-19 తర్వాత.. చాలా మంది జీవితా బీమాను తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కరోనా వైరస్ దేశంలో లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయారు. కుటుంబ పోషణ కూడా బారమైన పరిస్థితి నెలకొంది. ఆర్థిక సమస్యలతో ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే.. జీవిత బీమా ఉంటే సేఫ్ అని జనాలు భావిస్తున్నారు. అందుకే లైఫ్ ఇన్స్యూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారు. అయితే, లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించి పూర్తి అవగాహన లేకపోవడంతో దానిని కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులను నివారిస్తే జీవిత బీమా ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు. మరి జీవిత బీమా కొనుగోలు చేసే ముందు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇవాళ మనం తెలుసుకుందాం..

నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం..

ప్రజలు అనేక కారణాల వల్ల జీవిత బీమాను కొనుగోలు చేసే నిర్ణయాన్ని వాయిదా వేస్తుంటారు. 30-35 సంవత్సరాల వయస్సు ఉన్నవారు దానిని కొనవలసిన అవసరాన్ని అర్థం చేసుకోరు. ఈ వయసు వారు ప్రాణనష్టం సమస్య గురించి ఆలోచించరు.

టర్మ్ ప్లాన్ తీసుకోకపోవడం..

రెగ్యులర్ టర్మ్ ప్లాన్‌లో.. పాలసీ వ్యవధిలో పాలసీదారు మరణిస్తే నామినీకి హామీ మొత్తం చెల్లించబడుతుంది. అయితే, పాలసీదారు పాలసీ వ్యవధిని పూర్తి చేస్తే మెచ్యూరిటీ ప్రయోజనం ఉండదు. దీని కారణంగానే చాలా మంది టర్మ్ ప్లాన్ తీసుకోరు. అందుకే జీవిత బీమా పాలసీలను బీమాతో పాటు పెట్టుబడిని కూడా దృష్టిలో ఉంచుకుని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన సమాచారాన్ని దాచడం..

చాలా మంది పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెడతారు. వీటిలో ముందుగా ఉన్న వ్యాధులు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, ధూమపానం మొదలైనవి ఉన్నాయి. పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఇలాంటి సమాచారాన్ని దాయడం, లేదా నకిలీ పత్రాలను అందించడం వల్ల క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.

దీర్ఘకాలిక పాలసీ తీసుకోవడం..

కొన్ని బీమా కంపెనీలు 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు పాలసీలను అందిస్తాయి. అలాంటి పాలసీకి దూరంగా ఉండండి. ఈ కవర్‌లో ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.

షార్ట్ టర్మ్ పాలసీని కొనండి..

చాలా తక్కువ కాలానికి పాలసీని కొనడం కూడా తప్పు. 45-50 సంవత్సరాల జీవిత బీమా కొనుగోలు చౌకగా ఉంటుంది. అయితే, పాలసీ గడువు ముగిసిన తర్వాత మరణిస్తే కుటుంబానికి పరిహారం చెల్లించబడదు.

జీవిత బీమాను చెక్ చేయకపోవడం..

జీవిత బీమాను చెక్ చేసుకోవాలి. ప్రజలకు మరింత బాధ్యత పెరిగినప్పుడు బీమాపై దృష్టి పెట్టాలి. జీవిత బీమా చాలా అవసరం పడుతుంది.

చెల్లింపుల ఆప్షన్ తప్పుగా ఎంచుకోవడం..

చాలా జీవిత బీమా పాలసీలు వేర్వేరు చెల్లింపుల ఆప్షన్స్‌తో వస్తాయి. పాలసీదారు మరణించిన తర్వాత.. ఎంచుకున్న ఎంపిక ఆధారంగా నామినీకి చెల్లింపు చేయబడుతుంది. అందుకే సరైన చెల్లింపు ఆప్షన్‌ను ఎంచుకోవడం ముఖ్యం.

లిమిటెడ్ పేమెంట్స్ మోడ్ ఆప్షన్..

సాధారణ చెల్లింపు ఆప్షన్‌లో పాలసీ మొత్తం కాలానికి ఏటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ‘లిమిటెడ్ పేమెంట్స్’ ఆప్షన్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఇందులో కొన్నేళ్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రయోజనాల గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

కుటుంబానికి పాలసీ గురించి తెలియకపోవడం..

జీవిత బీమాను కొనుగోలు చేయడంలో ఇది పెద్ద తప్పు. చాలా మంది పాలసీలు కొనుగోలు చేసినప్పుడు, దాని గురించి వారి కుటుంబ సభ్యులకు తెలియజేయరు. ఇది అవసరమైనప్పుడు ఉపయోగించబడదు. అందువల్ల, కుటుంబ సభ్యులకు పాలసీ గురించి తెలియజేయడమే కాకుండా దాని వివరాలన్నింటినీ వారికి వివరించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..