దేశవ్యాప్తంగా ఉన్న మహిళల సాధికారత కోసం ఈ కొత్త పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. మహిళలు బీమా ఏజెంట్లుగా (బీమా సఖీ) అవకాశం పొందుతారు. వీరికి నెలకు రూ.7,000 వరకు ఆర్థిక సాయం అందిస్తారు. ఈ నేపథ్యంలో బీమా సఖీ యోజన గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌కు సంబంధించిన ప్రధాన పథకాలలో ఇది ఒకటిగా ఉంటుంది. 10వ తరగతి పాస్ అయిన 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళల కోసం ఉద్దేశించి రూపొందించారు. వారికి ముందుగా మూడేళ్ల శిక్షణ ఇచ్చి ఆర్థిక అవగాహన పెంచి బీమా ప్రాముఖ్యతను ఎలా అర్థం చేసుకోవాలో? తెలియజేస్తారు.
మూడు సంవత్సరాల శిక్షణ పొందిన తరువాత వారు పూర్తి స్థాయి ఏజెంట్లుగా మారతారు. అయితే వీరు ఎల్ఐసీకు సంబంధించిన సాధారణ ఉద్యోగులుగా ఉండరు. అలాగే ఎలాంటి ఉద్యోగుల ప్రయోజనాలను అందుబాటులో ఉండవు. బీమా సఖీ పథకంలో పాల్గొనే మహిళలు మూడేళ్ల శిక్షణ కాలంలో మొత్తం రూ. 2 లక్షలకు పైగా స్టైఫండ్‌ను అందుకుంటారు మొదటి సంవత్సరం: నెలకు రూ. 7,000, రెండవ సంవత్సరం: నెలకు రూ. 6,000, మూడవ సంవత్సరం: నెలకు రూ. 5,000 అందిస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి