PM Vaya Vandana Yojana: ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్‌.. నెలకు రూ.9250

|

Jan 22, 2023 | 11:51 AM

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వృద్ధులకు ఆసరాగా ఉండేందుకు పెన్షన్‌ సదుపాయాన్ని తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పెన్షన్‌ పథకాలు కూడా ఉన్నాయి..

PM Vaya Vandana Yojana: ఎల్‌ఐసీ నుంచి అద్భుతమైన పెన్షన్‌ స్కీమ్‌.. నెలకు రూ.9250
Pension Scheme
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. వృద్ధులకు ఆసరాగా ఉండేందుకు పెన్షన్‌ సదుపాయాన్ని తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో పెన్షన్‌ పథకాలు కూడా ఉన్నాయి. ఇందులో ప్రధాన్‌ మంత్రి వయ వందన యోజన పథకం ఒకటి. ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పెన్షన్ పథకంలో వివాహిత జంట 60 ఏళ్లు దాటితే గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ఇంతకుముందు ఈ పథకంలో ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టగల గరిష్ట మొత్తం రూ. 7.5 లక్షలు. తరువాత ప్రభుత్వం పెంచింది. 60 ఏళ్లు పైబడిన వివాహిత జంటలు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అరవై ఏళ్లు దాటిన వారికి జీవితంపై భరోసా కల్పించే ఉద్దేశంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి సంబంధించిన గడువుతేదీ 2021 మార్చి 31 ఉండగా, దానిని 2023 మార్చి 31 వరకు పెంచింది కేంద్రం. దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ ఈ స్కీంను ప్రభుత్వం తరపున అందిస్తోంది.

ప్రతి నెలా రూ.18,500 పెన్షన్ పొందడానికి భార్యాభర్తలిద్దరూ ప్రధాన్ మంత్రి వయ వందన యోజనలో రూ.15 లక్షల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. ఈ జంట పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 30 లక్షలు. ఈ పథకంపై 7.40% వార్షిక వడ్డీ రేటుతో జంట సంవత్సరానికి రూ. 2,22,000 పొందుతారు. రూ.2,22,000ను 12తో భాగిస్తే నెలవారీ పింఛను రూ.18,500 వస్తుంది. ఒక్క వ్యక్తి మాత్రమే ఈ పథకంలో రూ.15 లక్షలతో పెట్టుబడి పెడితే, నెలవారీ రాబడి రూ.9,250 అవుతుంది.
ఈ పాలసీ 10 ఏళ్లు కాలవ్యవధితో ఉంటుంది.

ఈ పథకంలో చేరేందుకు పింఛనుదారు నెలవారీ/త్రైమాసిక/అర్ధవార్షిక/వార్షిక ప్రాతిపదికన వడ్డీ చెల్లింపు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నెలవారీ ఆప్షన్‌ ఎంపిక చేసుకుంటే కనీసం రూ.1,62,162, త్రైమాసిక ఆప్షన్‌ ఎంచుకుంటే రూ.1,61,074, అర్ధవార్షిక ఆప్షన్‌లో రూ.1,59,574, వార్షిక ఆప్షన్‌ అయితే రూ.1,56,658 కనీస మొత్తానికి పాలసీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో కనిష్టంగా రూ. 1000 నుంచి గరిష్ఠంగా రూ.9,250 నెలవారీ పింఛను అందుకోవచ్చు. గతంలో ఈ పథకంలో చేరే పెద్దలకు 8 శాతం వడ్డీ ఇస్తుండగా, నెలకు గరిష్ఠంగా రూ.10,000 పింఛను అందేది. ఇప్పుడు దాన్ని 7.4 శాతానికి తగ్గించడంతో నెలవారీ గరిష్ఠ పింఛను రూ.9,250కి తగ్గుతోంది. పాలసీ కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత దీనిపై 75 శాతం వరకు రుణం పొందే సదుపాయం కూడా ఎల్‌ఐసీ అందిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి