AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC: ఒక్కసారి పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబుల్.. ఎల్‌ఐసీ నుంచి బిగ్ అప్డేట్..

ఎల్ఐసీ మరో రెండు ప్లాన్లను తీసుకొచ్చింది. కొత్తగా ప్రజల అవసరాలకు అనుగుణంగా రెండు ప్లాన్లను ప్రవేశఫెట్టింది. న్యూ జీవన్ సౌథీ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. న్యూ జీవన్ సౌథీ లిమిటెడ్ ప్రీమియం పేరుతో ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఈ ప్లాన్ల వివరాలు ఒకసారి చూద్దాం,

LIC: ఒక్కసారి పెట్టుబడి పెడితే మీ డబ్బులు డబుల్.. ఎల్‌ఐసీ నుంచి బిగ్ అప్డేట్..
Lic
Venkatrao Lella
|

Updated on: May 23, 2026 | 12:08 PM

Share

లైఫ్ ఇన్య్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేక కొత్త ప్లాన్లను తీసుకొచ్చింది. కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రయోజనాలను అందించేందుకు కొత్త సేవింగ్స్ స్కీమ్స్ తీసుకొస్తుంది. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవింగ్స్ పాలసీలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఇప్పుడు మరో రెండు బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. న్యూ జీవన్ సౌథీ బ్రాండ్ కింద రెండు కొత్త పాలసీలను ప్రారంభించింది. ఈ పాలసీల పేర్లు ఏంటి..? ఈ పాలసీలు తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

పాలసీలు ఇవే..

న్యూ జీవన్ సౌథీ సింగిల్ ప్రీమియం, జ్యూ జీవన్ సౌథీ లిమిటెడ్ ప్రీమియం పేరుతో ఎల్‌ఐసీ తాజాగా రెండు పాలసీలను మార్కెట్లోకి తెచ్చింది. పెట్టుబడిదారులకు స్థిరమైన, సురక్షితమైన సేవింగ్స్ ఎంపికలను అందించాలనే లక్ష్యంతో వీటిని ప్రవేశపెట్టింది. మార్కెట్లలో అస్థిరత కొనసాగుతున్న క్రమంలో చాలామంది తక్కువ రిస్క్ కలిగిన పెట్టుబడుల కోసం చూస్తున్నారు. అలాంటివారి కోసం ఎల్‌ఐసీ ఈ ప్లాన్లు తీసుకొచ్చింది. జూన్ 1 నుంచి ఈ రెండు పాలసీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండూ సేవింగ్స్ ప్లాన్లు. స్టాక్ మార్కెట్లలో ఎలాంటి సంబంధం ఉండదు. మార్కెట్లలో హెచ్చుతగ్గుల వల్ల ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. సింగిల్ ప్రీమియం ప్లాన్‌లో ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు. ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించవచ్చు.

పరిమిత ప్రీమియం ప్లాన్

ఇక రెండోవది పరిమిత ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్‌లో వాయిదాల ప్రకారం ప్రీమియం అనేది చెల్లించవచ్చు. వివిధ వర్గాల ప్రజల అవసరాలు, ఆదాయం ఆధారంగా ప్లాన్ ఎంచుకునేందుకు వీలుగా ఈ రెండు ఆప్షన్లను ప్రవేశపెట్టింది. ఎల్‌ఐసీ మార్కెట్లో తమ పట్టును నిలుపుకునేందుకు కొత్త పొదుపు, బీమా ప్లాన్లను ప్రవేశపెడుతోంది. ప్రజల అవసరాలు మారుతున్నందున దానికి అనుగుణంగా ప్లాన్లను ప్రవేశపెడుతోంది. అయితే కొత్త పథకాలతో ఎల్‌ఐసీ లాభాలు కూడా పెరుగుతున్నాయి. 2026 నాల్గో త్రైమాసికంలో నికర లాభం 23 శాతం పెరిగింది. అంటే రూ.23,420 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఈ లాభం రూ.19,013 కోట్లుగా ఉంది. ఇక కంపెనీ ప్రీమియం ఆదాయం అనేది గత ఏడాది రూ.1.5 లక్షల కోట్ల నుంచి రూ.1.7 లక్షల కోట్లకు పెరిగింది. అటు ఎల్‌ఐసీ ఇటీవల పెట్టుబడిదారులకు శుభవార్త అందించింది. ఒక్కొ షేరుకు రూ.10 డివిడెండ్ ప్రకటించింది. దీంతో ఎల్‌ఐసీలో పెట్టుబడి పెట్టినవారిని ఇది గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు.

Follow Us