LIC Policy: ఎల్‌ఐసీలో అద్భుమైన పాలసీ.. ఒకేసారి డబ్బు డిపాజిట్‌ చేయండి.. ప్రతినెల రూ.20వేల పెన్షన్‌ పొందండి..!

LIC Policy: ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ల..

LIC Policy: ఎల్‌ఐసీలో అద్భుమైన పాలసీ.. ఒకేసారి డబ్బు డిపాజిట్‌ చేయండి.. ప్రతినెల రూ.20వేల పెన్షన్‌ పొందండి..!
Follow us
Subhash Goud

|

Updated on: Nov 23, 2021 | 10:02 AM

LIC Policy: ఎల్‌ఐసీ వినియోగదారుల కోసం రకరకాల పాలసీలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పటికే ఎన్నో రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌ల ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందే విధంగా ఎంచుకుంటున్నారు వినియోగదారులు. ఎల్‌ఐసీ స్కీమ్‌లో భాగంగా ‘జీవన్‌ అక్షయ్‌’ పాలసీ ఒకటి. ఇందులో ఏకకాలంలో పెట్టుబడి పెట్టినట్లయితే జీవితాంతం నెలనెల పెన్షన్‌ తీసుకునే సదుపాయం ఉంటుంది. మీరు ఎల్‌ఐసీ జీవన్‌ అక్షయ్‌ స్కీమ్‌లో కుటుంబ సభ్యుల కోసం పెట్టుబడి పెట్టవచ్చు. మీరు స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే మీరు వార్షికంగా, అర్ధ సంవత్సరం, త్రైమాసికం లేదా ప్రతి నెలా పెన్షన్‌ పొందవచ్చు. అయితే సాధారణంగా ఏదైనా పాలసీ తీసుకుంటే ప్రతినెలా లేదా ఆరు నెలలకోసారి, సంవత్సరం కోసారి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ సింగిల్‌ ప్రీమియం పాలసీలు చెల్లించడం వల్ల మంచి ప్రయోజనం పొందవచ్చు. ప్రతి నెల ఆదాయం కోరుకునేవారికి ఇది మంచి అవకాశం. ఈ పాలసీల్లో చేరాలంటే కనీసం 30 ఏళ్లు. గరిష్టంగా 85 ఏళ్లు.

ఈ పథకంలో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీరు పెట్టుబడి పెట్టిన వెంటనే పాలసీ జారీ చేయబడుతుంది. మూడు నెలల తర్వాత రుణ సదుపాయం కూడా ఉంటుంది. ఈ పథకంలో గరిష్ట పరిమితి అంటూ ఏమిలేదు. ఇది ఒకే ప్రీమియం నాన్‌-లిక్డ్‌ నాన్‌ పార్టిసిపేటింగ్‌, పర్సనల్‌ యాన్యుటి పాలసీ. ఇందులో కనీసం లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే వార్షిక పెన్షన్‌ రూ.12,000 పొందవచ్చు.

రూ. 20వేల పెన్షన్‌ కోసం.. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) జీవన్‌ అక్షయ్‌ -VII పాలసీలో మొత్తం పది ఆప్షన్లు ఉంటాయి. మీరు ఒకే ప్రీమియంలో ప్తరి నెల రూ.20 వేల వరకు పెన్షన్‌ పొందే సదుపాయం ఉంటుంది. మీకు ప్రతి నెల ఈ పెన్షన్‌ కావాలంటే మీరు నెలకు మాత్రమే పెన్షన్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.20,000 పెన్షన్ పొందాలంటే ఒకేసారి రూ.40,72,000 ఇన్వెస్ట్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు నెలవారీగా పెన్షన్‌ రూ.20,967 అందుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీకు ఎంత పెన్షన్‌ కావాలి.. ఎంత పెట్టుబడి పెడతారు అనే విషయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడిని బట్టి మీకు ఎంత పెన్షన్‌ వస్తుందనేది నిర్ణయిస్తుంది.

అయితే ఇలా జీవితకాలమంతా పొందవచ్చు. మొదటిసారి ప్రీమియంను బట్టి యాన్యుటీ మారుతుంటుంది. పాలసీ తీసుకున్నప్పుడు వడ్డీ రేటును లాక్‌ చేస్తారు. ఒకసారి వడ్డీ రేటును నిర్ణయిస్తే జీవితకాలం అదే రేటు వర్తిస్తుంది.

ఇవి కూడా చదవండి:

Aadhaar Card Holders: ఆధార్‌ కార్డు వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. 166 ఆధార్‌ సేవా కేంద్రాలు..!

Maruti Suzuki: మారుతి సుజుకీ కీలక నిర్ణయం.. మళ్లీ డీజిల్‌ వాహనాల తయారీలోకి ప్రవేశించే ప్రసక్తే లేదు