LIC Alert: LIC కస్టమర్లకు హెచ్చరిక.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవంటూ ఎల్ఐసీ వార్నింగ్..

|

Jun 12, 2021 | 10:36 AM

ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ వినియోగదారులకు నిత్యం

LIC Alert: LIC కస్టమర్లకు హెచ్చరిక.. అలా చేస్తే ఇబ్బందులు తప్పవంటూ ఎల్ఐసీ వార్నింగ్..
Lic
Follow us on

ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) తమ వినియోగదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ వస్తుంది. ఇటీవల వినియోగదారులకు సోషల్ మీడియా ద్వారా ప్రతి చిన్న అప్ డేట్ అందిస్తున్న సంస్థ.. తాజాగా ప్రజలను హెచ్చరించింది. కంపెనీ లోగోను ఎవరు కూడా ఉపయోగించవద్దని సూచించింది. కంపెనీ అనుమతి లేకుండా.. లోగో ఉపయోగించడం శిక్షార్హమని తెలిపింది. ఇలా చేస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని ఎల్ఐసీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఎల్ఐసీ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

ట్వీట్..

ఏ వెబ్‌సైట్ కానీ లేదంటే ఇతరులు, వ్యాపారులు ఇలా ఎవ్వరూ కూడా కంపెనీ అనుమతి లేనిదే ఎల్‌ఐసీ లోగో ఉపయోగించకూడదని తెలిపింది. అలా చేసినవారికి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. అంతేకాకుండా.. మరో విషయంపై కూడా కస్టమర్లను ఎల్ఐసీ అలర్ట్ చేసింది. మోసగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలిని కోరింది. ఎల్ఐసీ అధికారులు ఫోన్ కాల్ చేసి పాలసీ నెంబర్లు, పాన్ నెంబర్లు, నామినీ వివరాలు అడగరు అని స్పష్టం చేసింది. ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ఏదైనా అనుమానిత కాల్స్ లేదా అనుమానాస్పద మెయిల్స్ వస్తే.. spuriouscalls@licindia.comకు తెలియజేయాలని తెలిపింది. కంపెనీ కాల్ సెంటర్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచింది. 022-6827 6827 నెంబర్‌కు కాల్ చేయొచ్చు. సందేహాలను పరిష్కరించుకోవచ్చు.

ట్వీట్..

Also Read: Esha Rebba: మలయాళంలోకి ఎంట్రీ ఇవ్వనున్న తెలుగమ్మాయి.. అరవింద్ స్వామి సినిమాలో ఈషా..

YS Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్‌.. సీబీఐ విచారణలో బయటపడుతున్న కొత్త కోణాలు

Weight Loss: బరువు తగ్గాలని భావిస్తున్నారా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ మూడు తాగండి.. ఫలితం చూసి షాక్ అవుతారు..!

Buttermilk – Curd : మంచి ఆరోగ్యానికి పెరుగు ఉత్తమమా? మజ్జిగ ఉత్తమమా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..