AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kotak Mahindra Bank: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్.. వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడి..

పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ గురువారం ప్రకటించింది. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేటును 4 శాతానికి పెంచుతున్నట్లు ప్రైవేట్ బ్యాంక్ ప్రకటించింది.

Kotak Mahindra Bank: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన కోటక్‌ మహీంద్రా బ్యాంక్.. వడ్డీ రేట్లు పెంచుతున్నట్లు వెల్లడి..
Kotak
Srinivas Chekkilla
|

Updated on: Jun 09, 2022 | 9:52 PM

Share

పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు కోటక్ మహీంద్రా బ్యాంక్ గురువారం ప్రకటించింది. సేవింగ్స్ ఖాతాపై వడ్డీ రేటును 4 శాతానికి పెంచుతున్నట్లు ప్రైవేట్ బ్యాంక్ ప్రకటించింది. ఇంతకుముందు ఇది ఏడాదికి 3.5 శాతంగా ఉండేది. పొదుపు ఖాతాపై కొత్త వడ్డీ రేటు జూన్ 13, 2022 నుంచి అమలులోకి వస్తుంది. అదే సమయంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను15 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. FDపై కొత్త వడ్డీ రేట్లు జూన్ 10, 2022 నుంచి వర్తిస్తాయి. బ్యాంక్ ఒక సంవత్సరం కంటే ఎక్కువ FDలపై వడ్డీ రేట్లను పెంచింది. 365 రోజుల నుంచి 389 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే FDలపై వడ్డీ రేటు 5.40 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. కాగా, 390 రోజుల మెచ్యూరిటీ ఉన్న టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.50 శాతం నుంచి 5.65 శాతానికి పెంచింది. ఇది కాకుండా, 391 రోజుల నుండి 23 నెలల కంటే తక్కువ వ్యవధి ఉన్న FDలకు ఇప్పుడు 5.65 శాతం వడ్డీ లభిస్తుంది. అదే సమయంలో 23 నెలల నుండి మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. కాగా, మూడేళ్ల నుంచి 10 ఏళ్ల కాలపరిమితి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేటు గతంలో 5.75 శాతం నుంచి 5.90 శాతానికి పెరిగింది.

రెపో రేటును పెంచిన తర్వాత, అనేక బ్యాంక్ ఎఫ్‌డిల వడ్డీ రేట్లు పెంచబడుతున్నాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్‌తో పాటు, ఆర్‌బిఎల్ బ్యాంక్ అంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేటును పెంచాలని నిర్ణయించింది. RBL బ్యాంక్ ప్రకారం, 15 నెలల FD పథకంపై ఇప్పుడు 6.65 శాతం వడ్డీ ఇవ్వబడుతుంది. కొత్త రేట్లు జూన్ 8, 2022 నుండి అమలులోకి వస్తాయి. రూ.2 కోట్లు, రూ.3 కోట్ల లోపు డిపాజిట్లపై కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఇబిఎల్‌ఆర్)ని 50 బేసిస్ పాయింట్లు 8.10 శాతం నుండి 8.60 శాతానికి పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన దృష్ట్యా, EBLR పెంచబడింది మరియు ఇప్పుడు అది 8.60 శాతానికి చేరుకుందని ICICI బ్యాంక్ తన వెబ్‌సైట్‌లో రాసింది. కొత్త రేట్లు జూన్ 8, 2022 నుండి అమలులోకి వచ్చాయి.

శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో పెద్దపులి స్విమ్మింగ్
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
లక్కు కలిసొచ్చిందిరోయ్.. 50 ఏళ్ల తర్వాత అదృష్టపట్టే రాశులివే..
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
ఈ ఏడాదిని నా జీవితంలో మర్చిపోను
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో