Financial Planning: సక్సెస్‌కు చిరునామా 50-30-20 రూల్‌! ఆర్థిక ప్రణాళికలో ఈ నియమం గురించి తెలుసుకుంటే చాలు.. జీవితం సుఖమయం..

50-30-20 నియమం అనేది ఫ్యామిలీ బడ్జెట్‌ను చక్కగా విభజిస్తుంది. పేరు సూచిస్తున్న విధంగానే మూడు భాగాలుగా ఇది ఉంటుంది. మొదటిది ‘50’.. అంటే మీకు వస్తున్న రాబడిలో 50శాతం మీ ఖర్చులకు వినియోగించుకోవాలి. అలాగే మరో 30శాతం మీరు వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోవాలి. అదే విధంగా 20శాతం మొత్తాన్ని పొదుపు చేయాలి. ఇదంతా మీ రాబడి నుంచే చేయాల్సి ఉంటుంది.

Financial Planning: సక్సెస్‌కు చిరునామా 50-30-20 రూల్‌! ఆర్థిక ప్రణాళికలో ఈ నియమం గురించి తెలుసుకుంటే చాలు.. జీవితం సుఖమయం..
Financial Planning

Edited By:

Updated on: Oct 23, 2023 | 8:30 AM

ఆర్థిక ప్రణాళిక ప్రతి ఒక్కరికీ అవసరం. మన రాబడి ఎంత? మన ఖర్చులు ఎంత? ఎంత మొత్తంలో మనం పొదుపు చేస్తున్నాం? అన్న అంశాలను ప్రతి నెలా బేరీజు వేసుకోవాలి. అలాగే పదవీవిరమణకు ఎంత మొత్తాన్ని ప్రతి నెలా వెనకేసుస్తు‍న్నాం? అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు ఏమైనా దాస్తున్నామా? ఈ లెక్కలన్నీ పక్కాగా ఉంటేనే మీరు జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవడం సులభతరం అవుతుంది. ఈ ప్రణాళికలు పలు రకాలుగా ఉంటాయి. అయతే అందరికీ తెలిసింది.. అందరూ వినియోగించేది.. ఎక్కువ సక్సెస్‌ రేటు ఉన్న ఆర్థిక ప్రణాళిక విధానం ‘50-30-20 రూల్‌’. ఇది బండ గుర్తుగా చేసేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని సాయంతో మీరు మీ రాబడి, ఖర్చులు, పొదులను సులువుగా విభజించవచ్చు. ఈ నేపథ్యంలో ‘50-30-20 రూల్‌’ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

50-30-20 రూల్‌ ఏంటి?

50-30-20 నియమం అనేది ఫ్యామిలీ బడ్జెట్‌ను చక్కగా విభజిస్తుంది. పేరు సూచిస్తున్న విధంగానే మూడు భాగాలుగా ఇది ఉంటుంది. మొదటిది ‘50’.. అంటే మీకు వస్తున్న రాబడిలో 50శాతం మీ ఖర్చులకు వినియోగించుకోవాలి. అలాగే మరో 30శాతం మీరు వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకోవాలి. అదే విధంగా 20శాతం మొత్తాన్ని పొదుపు చేయాలి. ఇదంతా మీ రాబడి నుంచే చేయాల్సి ఉంటుంది.

50శాతం అవసరాలకు.. ఈ 50-30-20 రూల్‌ ప్రకారం మీ కొచ్చే రాబడి నుంచి అవసరాలు అంటే మీరు బతకడానికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలి. ఇంట్లో అవసరాలు, కిరాణా సామగ్రి, వస్త్రాలు, ఈఎంఐలు, బైక్‌ ఇన్సురెన్స్‌, విద్య, ఆరోగ్య పరమైన అవసరాలు అన్ని ఈ కేటగిరీలోకి వస్తాయి.

ఇవి కూడా చదవండి

30శాతం మీ కోరికలకు.. ఇవి మీకు ఆప్షనల్‌ అన్నమాట. అందరికీ వీటి అవసరం ఉండకపోవచ్చు. కానీ మీ రాబడిలో నుంచి 30శాతం నగదును ఎప్పుడైనా విహారయాత్రలు, సినిమాలు, ఆటపాటలు వంటి వాటి కోసం వీటిని వినియోగించుకోవాలి. లేదా మీ చిరుతిండ్లు, మీ వ్యక్తిగత యాక్టివీటీస్‌ వీటిని పక్కన పెట్టుకొని వినియోగించుకోవాలి.

మరో 20శాతం పొదుపు.. మీరు సంపాదిస్తున్న మొత్తంలో 50శాతం అవసరాలకు పోగా.. 30శాతం మీ వ్యక్తిగత ఖర్చులకు పోగా.. మిగిలిన 20శాతం మొత్తాన్ని కచ్చితంగా పొదుపు కోసం వినియోగించాలి. వీటిని డైవర్సిఫై చేసి వివిధ పెట్టుబడి పథకాలలో ఇన్‌వెస్ట్‌ చేయాలి. వాటిల్లో మ్యూచువల్‌ ఫండ్స్‌, ఎమర్జెన్సీ ఫండ్‌, రికరింగ్‌ డిపాటిట్‌ వంటి వాటిల్లో దాయాలి. ఇవి మీకు భవిష్యత్తుకు భరోసా ఇస్తాయి.

ఈ ఉదాహరణ చూడండి..

ఒక వ్యక్తి నెలకు రూ. 60,000 సంపాదిస్తున్నాడు అనుకుందాం.. ఇతనికి 50-30-20 రూల్‌ అప్లై చేస్తే.. కుటుంబ అవసరాలు అంటే ఇంటి అద్దె, కేబుల్‌, కరెంట్‌ బిల్లలు, గృహ రుణాలు ఇతర ఖర్చులకు 50శాతం అంటే రూ. 30,000 వినియోగించాలి. ఆ తర్వాత ఇతర అవసరాలు, ఖర్చులు అంటే విహారయాత్రలు, ఇతర చిరుతిండ్ల కోసం మీ సంపాదన ఉంచి 30శాతం అంటే రూ. 18,000 పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా మిగిలిన 12 వేలను పొదుపు కోసం వినియోగించాలి. వీటిని ప్రణాళిక ప్రకారం వివిధ పెట్టుబడి పథకాలలో పెట్టుబడి పెట్టాలి. వీలైతే ఓ ఆర్థిక నిపుణుడి సలహా తీసుకొని చక్కగా డైవర్సిఫై చేయాలి. ఇది మీ భవిష్యత్‌ జీవితాన్ని సుఖమయం చేయడంలో సహాయపడుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..