Kisan Credit Card : రైతులందరికీ వ్యవసాయం కోసం చౌక రుణాలు అందించడానికి వ్యవసాయ మంత్రిత్వ శాఖ కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి దీనిని అనుసంధానం చేశారు. 2020 ఫిబ్రవరి నుంచి అమలు చేస్తున్న ఈ పథకంలో ఇప్పటివరకు 210.27 లక్షల మంది కొత్త రైతుల దరఖాస్తులను ఆమోదించారు. దీని కింద చౌకైన రుణాలను అందజేస్తున్నారు.
అవసరమైన పత్రాలను సమర్పించి మీరు కూడా కిసాన్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోండి. బ్యాంక్ 15 రోజుల్లోపు కార్డును జనరేట్ చేయాలి. లేకపోతే మీరు మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి రైతులకు కేసిసీ కార్డ్‌లను (కిసాన్ క్రెడిట్ కార్డు) అందించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ బ్యాంకర్స్ అసోసియేషన్‌ను కోరింది. వాస్తవానికి ఫైనాన్షియర్ల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకునే బదులు రైతులు ఈ కార్డ్ ద్వారా తక్కువ రేటుకు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు.
కెసిసిని ఎవరు తీసుకోవచ్చు..
వ్యవసాయం, మత్స్యసంపద, పశుసంవర్ధకంతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి అయినా కేసీసీ కార్డును తీసుకోవచ్చు. అంతేకాదు అతను వేరొకరి భూమిలో కౌలు సాగు చేసినప్పటికీ KCC ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్ కేవలం వ్యవసాయానికి మాత్రమే పరిమితం కాదు. పశుసంవర్ధక, మత్స్య సంపద కోసం కూడా. రూ .2 లక్షల వరకు మాత్రమే రుణం లభిస్తుంది. వ్యవసాయానికి రూ. 3 లక్షలు అందుబాటులో ఉంటాయి. ఎస్‌బిఐ, పిఎన్‌బి, హెచ్‌డిఎఫ్‌సి సహా అన్ని ప్రధాన బ్యాంకుల్లో కెసిసిని పనులు జరుగుతున్నాయి.
KCC కోసం అవసరమైన పత్రాలు, అర్హత
1. సరిగా నింపిన దరఖాస్తు
2. ఫారం – గుర్తింపు రుజువు – ఓటరు ఐడి కార్డు, పాన్ కార్డు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు (ఆధార్), డిఎల్ మొదలైనవి.
3. మరే ఇతర బ్యాంకులోనూ రుణగ్రహీత కాదని అఫిడవిట్.
4. దరఖాస్తుదారుడి ఫోటో –
5. వ్యక్తిగ వ్యవసాయం లేదా ఉమ్మడి వ్యవసాయం చేసే రైతులు దీనికి అర్హులు.
6. కౌలుదారులు, వాటా రైతులు, స్వయం సహాయక సంఘాలు కూడా ప్రయోజనాలను పొందవచ్చు.
7. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సహకార, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు దీనిని తయారు చేయగలవు.
8. మీరు సాధారణ సేవా కేంద్రం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
1.60 లక్షలు చౌకైన వడ్డీ.. హామీ అవసరం లేదు..
KCC పై తీసుకున్న రూ.3 లక్షల వరకు రుణాలపై వడ్డీ రేటు 9 శాతం. ఇందులో ప్రభుత్వం 2 శాతం సబ్సిడీ ఇస్తుంది. సమయానికి డబ్బు చెల్లించేవారికి 3 శాతం ఎక్కువ తగ్గింపు లభిస్తుంది. ఈ విధంగా నిజాయితీ గల రైతులకు వడ్డీ రేటు 4 శాతం ఆదా అవుతుంది.