Kia Seltos Facelift: కిర్రాక్ లుక్‌లో కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ..

బ్రాండ్ న్యూ కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్‌ను మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. ఈ కొత్త ఎస్ యూవీ కారు మేడ్ ఇన్ ఇండియా. జూలై 14 నుంచి ఈ కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. 

Kia Seltos Facelift: కిర్రాక్ లుక్‌లో కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్.. సరికొత్త ఫీచర్లతో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ..
Kia Seltos Facelift
Follow us

|

Updated on: Jul 05, 2023 | 11:12 AM

కొరియన్ బ్రాండ్ కియా మన ఇండియన్ మార్కెట్లో దూసుకెళ్తోంది. అత్యాధునిక ఫీచర్లు, సరికొత్త డిజైన్ లో కార్లను ఆవిష్కరిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇదే క్రమంలో మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కియా సెల్టోస్ ఎస్‌యూవీ కారును అప్ గ్రేడ్ చేసింది. సరికొత్త ఫీచర్లను జోడించి, లుక్ లోనూ కొన్ని మార్పులు చేసింది. ఈ మేరకు బ్రాండ్ న్యూ కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ వేరియంట్‌ను మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. దీనిని ఇంతకు ముందే సౌత్ కొరియాలో గతేడాది బుసాన్ ఆటో షో కియా కంపెనీ విడుదల చేసింది. అదే వెర్షన్ ను ఇప్పుడు ఇండియాలో లాంచ్ చేసింది. ఈ కారు మన దేశంలో హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి మిడ్ సైజ్ ఎస్‌యూవీలకు పోటీ కానుంది. జూలై 14 నుంచి ఈ కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ క్రమంలో కియా కారులోని బెస్ట్ ఫీచర్లు, అప్ గ్రేడెడ్ స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం..

కియా సెల్టోస్ ధర ఎంత ఉండొచ్చు..

కియా నుంచి వస్తున్న ఈ కొత్త ఎస్ యూవీ కారు మేడ్ ఇన్ ఇండియా. దీనిని మన ఇండియాలోని ప్లాంట్ లోనే తయారు చేశారు. పాత మోడల్ కియా సెల్టోస్ ధర రూ. 10.89 లక్షల నుంచి రూ.19.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంది. ఈ నేపథ్యంలో కొత్త అప్ గ్రేడెట్ కియా సెల్టోస్ ధర రూ. 12 లక్షల నుంచి ప్రారంభమై రూ. 19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని కచ్చితమైన ధర ఆగస్టులో ప్రకటించే అవకాశం ఉంది. ఈ కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ డ్యూయల్-టోన్, మ్యాట్ గ్రాఫైట్ వేరియంట్‌లతో సహా 8 కలర్ ఆప్షన్లలో వస్తుంది.

డిజైన్, స్పెసిఫికేషన్లు..

పాత మోడల్ సెల్టోస్ తో పోల్చితే కొత్త మోడల్లో డిజైన్ లో మార్పులు చేశారు. ఎల్ఈడీలో డేటైమ్ రన్నింగ్ లైట్లు అమర్చారు. ఎల్ఈడీ హెడ్ లైట్లతో అప్ గ్రేడ్ చేశారు. దీంతో ఫ్రంట్ లుక్ టోటల్ కొత్తగా కనిపిస్తుంది. సెల్టోస్‌లో రిఫ్రెష్ అయిన ఫ్రంట్ ఫాసియా, రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త స్కిడ్ ప్లేట్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు, 18-అంగుళాల గ్లోసీ బ్లాక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వెనుక బంపర్‌లో ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, ఫాక్స్ డ్యూయల్ ఎగ్జాస్ట్ లు కూడా ఉన్నాయి. వినియోగదారులు మూడు ట్రిమ్ ఎంపికల నుంచి ఎంచుకోవచ్చు. ఎక్స్-లైన్, జీటీ-లైన్, టెక్ లైన్ వేరింయట్లు అందుబాటులో ఉన్నాయి. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ తో పాటు కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. కస్టమర్‌లు ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, సీవీటీ యూనిట్ లేదా ఆరు-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్‌ని ఎంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సౌకర్యవంతమైన ఫీచర్లు..

ఇది పనోరమిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఎయిర్ కండీషనర్, యాంబియంట్ మూడ్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో విస్తృతమైన భద్రతా ఫీచర్లు ఉన్నాయి. 32 భద్రతా ఫీచర్లతో ప్రయాణికులకు భరోసానిస్తుంది.

బుకింగ్స్ ఎప్పుడంటే..

కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ ప్రీ బుకింగ్‌లు జూలై 14న ప్రారంభమవుతాయి. అంతేకా కియా కంపెనీ కే కోడ్ డెలివరీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే కియా కస్టమర్లుగా ఉన్న వారికి ప్రాధాన్యమిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..