AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: పర్యావరణ పరిరక్షణకు భారత రైల్వే కీలక చర్యలు.. విద్యుద్ధీకరణతో పాటు స్టేషన్స్‌లో సౌకర్యాల అప్‌డేట్

పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యంతో ఇతర ఉద్గారాలను తగ్గించడం, వనరులు, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపే నిరంతర కార్యక్రమాలను రైల్వే శాఖ తీసుకుంటుంది. భారతీయ రైల్వేలు ఏప్రిల్ వరకు 63,456 రూట్ కిలోమీటర్లు విద్యుదీకరించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల యొక్క మొత్తం బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్‌లో 96 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది.

Indian Railways: పర్యావరణ పరిరక్షణకు భారత రైల్వే కీలక చర్యలు.. విద్యుద్ధీకరణతో పాటు స్టేషన్స్‌లో సౌకర్యాల అప్‌డేట్
Indian Railways
Nikhil
|

Updated on: Jun 07, 2024 | 5:45 PM

Share

భారతీయ రైల్వేలు ఇటీవల పర్యావరణ అనుకూలమైన భారీ రవాణా సాధనంగా మారుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యంతో ఇతర ఉద్గారాలను తగ్గించడం, వనరులు, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపే నిరంతర కార్యక్రమాలను రైల్వే శాఖ తీసుకుంటుంది. భారతీయ రైల్వేలు ఏప్రిల్ వరకు 63,456 రూట్ కిలోమీటర్లు విద్యుదీకరించిందని ఇటీవల ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల యొక్క మొత్తం బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్‌లో 96 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. మొత్తం 2,637 స్టేషన్లతో పాటు సర్వీస్ భవనాలకు 177 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ రూఫ్-టాప్ ప్లాంట్లు అందించామని అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం భారతీయ రైల్వేలు తీసుకున్న చర్యల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఈ ఏడాది నుంచి భారతీయ రైల్వేలు పర్యావరణంపై ప్రవర్తనా మార్పుల ప్రభావం గురించి ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ‘మిషన్ లైఫ్’పై సామూహిక సమీకరణ కోసం ప్రధాన ఔట్రీచ్, అడ్వకేసీ కార్యకలాపాలను కూడా తీసుకుంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు అన్ని భారతీయ రైల్వేలలో 249 అవగాహన మరియు 147 యాక్షన్ ఈవెంట్‌లు నిర్వహించారు. భారతీయ రైల్వేలు సుస్థిరంగా ఉండేందుకు తీసుకున్న కొన్ని ప్రధాన విధాన కార్యక్రమాలలో రైల్వే స్టేషన్లతో పాటు ఇతర భవనాల పునరాభివృద్ధికి సూపర్ ఈసీబీసీ సమ్మతి ఇంధన సామర్థ్య మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ సూపర్ ఈసీబీసీ మార్గదర్శకాలు వాతావరణానికి ప్రతిస్పందించే భవన రూపకల్పనతో పాటు శక్తి సామర్థ్య సాంకేతికతల ద్వారా శక్తి డిమాండ్‌ను తగ్గించే లక్ష్యంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి కోసం భారతీయ రైల్వేలు పర్యావరణ నిర్వహణ ప్రణాళిక రూపంలో మార్గదర్శకాలను అందించాయి. పరిసర ప్రాంతాలలో నిర్మాణ ప్రభావాలను తగ్గించడానికి జోనల్ రైల్వేల్లో ఈ మార్గదర్శకాలను అనుసరించాలని అధికారులు పేర్కొంటున్నారు.

భారతీయ రైల్వేలు దాని ఉత్పత్తి ప్రక్రియలో ఇంధన సామర్థ్యానికి సంబంధించి ప్రధాన చర్యలు తీసుకుంది. ప్రస్తుతం మొత్తం 8 పీయూలు, 44 వర్క్‌షాప్‌లు ఐఎస్ఓ-50001 సర్టిఫికేట్ పొందాయి. ఇది శక్తి పొదుపు మరియు శక్తి సామర్థ్యం పట్ల నిబద్ధతను చూపుతుంది. పర్యావరణ నిర్వహణ వ్యవస్థను ఐఎస్ఓ 14001కి అమలు చేయడానికి దాదాపు 700 ప్రధాన రైల్వే స్టేషన్లు సర్టిఫికేట్ పొందాయి. ఇంకా భారతీయ రైల్వేలు దాదాపు 65 ఎఫ్లూయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లు, 86 వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్లు, 90 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు, 18 వ్యర్థాల నుంచి 186 వ్యర్థాల వరకు కంపోస్ట్, 32 సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లు అందుబాటులో వచ్చాయి. దాదాపు 208 స్టేషన్లలో కంపోస్టింగ్ ప్లాంట్లు ఉన్నాయి. 193 రైల్వే స్టేషన్లలో మెటీరియల్ రికవరీ సౌకర్యాలు ఉన్నాయి. ప్రధాన రైల్వే స్టేషన్లలో దాదాపు 826 ప్లాస్టిక్ వాటర్ బాటిల్ క్రషింగ్ మెషీన్లను ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..