Bike Discounts: బంపర్‌ ఆఫర్‌.. బైక్‌ కొంటే రూ.50 వేల వరకు తగ్గింపు.. ఏప్రిల్‌ 30 వరకు గడువు

|

Apr 09, 2021 | 4:08 PM

Bike Discounts: మార్కెట్లో రోజురోజుకు కొత్త బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వారికి తగ్గట్లుగా బైక్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి పలు కంపెనీలు. కస్టమర్లను మరింతగా ఆర్షించేందుకు..

Bike Discounts: బంపర్‌ ఆఫర్‌.. బైక్‌ కొంటే రూ.50 వేల వరకు తగ్గింపు.. ఏప్రిల్‌ 30 వరకు గడువు
Bike Discounts
Follow us on

Bike Discounts: మార్కెట్లో రోజురోజుకు కొత్త బైక్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని వారికి తగ్గట్లుగా బైక్‌లను ఉత్పత్తి చేస్తున్నాయి పలు కంపెనీలు. కస్టమర్లను మరింతగా ఆర్షించేందుకు తాజాగా కవాసకి కొత్త మోడళ్లను తయారు చేయడమే కాకుండా… భారీగా ఆఫర్లు ఇస్తోంది. అయితే కొత్త బైక్‌ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్తే. ఓ ద్విచక్ర వాహన కంపెనీ వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. దిగ్గజ టూవీలర్‌ తయారీ కంపెనీ కవాసకి ఇండియా తన మోడళ్లపై అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చింది. బైక్‌ కొనుగోలుపై భారీ తగ్గింపు ఇస్తోంది. కంపెనీ ట్విట్టర్‌ వేదికగా ఆఫర్‌ వివరాలు వెల్లడించింది. సాధారణ బైక్‌ నుంచి స్పోర్ట్స్‌ బైక్‌కు అప్‌గ్రేడ్‌ అవ్వాలని భావించే వారికి ఇది మంచి వార్తే. మీరు నచ్చిన బైక్‌ కొనుగోలు చేయాలని భావిస్తే దగ్గరలోని కవాసకి షోరూమ్‌కు వెళ్లి ఆఫర్‌ తెలుసుకోవచ్చు.

ఈ బైక్‌లపై తగ్గింపు ఆఫర్లు ఏప్రిల్‌ 30 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. వల్కన్‌ ఎస్‌ మోడల్‌పై రూ.20వేలు, వెర్సీస్‌ 650 బైక్‌పై రూ.30 వేలు, నింజా 1000 ఎస్‌ఎక్స్‌ బైక్‌పై రూ.30 వేలు, డబ్ల్యూ 800 మోడళ్లపై రూ.30 వేల తగ్గింపు లభిస్తోంది. అంతేకాదు.. ఇతర బైక్‌లపై ఆఫర్లు ఉన్నాయి. ఆప్‌లోడ్‌ బైక్స్‌పై కూడా డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంటుంది. కేఎల్‌ఎక్స్‌ 110 మోడల్‌పై రూ.30వేల వరకు తగ్గింపు లభిస్తోంది. కేఎల్‌ఎక్స్‌ 140 మోడల్‌పై రూ.40 వేల వరకు డిస్కౌంట్‌, కేఎక్స్‌ 100 మోడల్‌పై రూ.50 వేల తగ్గింపు ఉంది. ఈ ఆఫర్లు స్టాక్‌ ఉన్నంత వరకే అందుబాటులో ఉంటాయని సదరు కంపెనీ వెల్లడించింది.

ఇవీ చదవండి:

Best Selling Bikes: దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్‌ -10 బైక్‌లు ఇవే.. అత్యధిక మైలేజ్‌.. వాటి ధరలు.. !

Electric Bike: ఈ బైక్‌ 17 రూపాయిల‌తో 116 కిలోమీట‌ర్ల ప్రయాణం.. అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్‌ బైక్‌

JIo Fiber Offer: మీరు జియో ఫైబర్‌ వాడుతున్నారా..? అయితే ఈ ఆఫర్‌ మీ కోసమే.. 30 రోజుల వ్యాలిడిటి ఉచితం..

SBI Interest Rates: కస్టమర్లకు ఎస్‌బీఐ షాక్‌..ఆ వడ్డీ రేటు భారీగా పెంపు..ఎంత పెంచారంటే..