Kalyan Jewelers: వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త ఆలోచనతో కల్యాన్ జ్యుయలర్స్ సంస్థ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం మెుదటి ఆరు నెలల కాలంలో దీనిని ఆచరణలోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే దక్షిణాదిలో బలంగా ఉన్న కంపెనీ.. తన నూతన స్టోర్లను ఇతర మార్కెట్లలోకి ప్రవేశించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ ఈడీ రమేశ్ కల్యాణరామన్ వెల్లడించారు. ముందుగా 2025 నుంచి ఫ్రాంఛైజీ విధానంలో విస్తరించాలని భావించినప్పటికీ.. గత 3–4 త్రైమాసికాలుగా నెలకొన్న డిమాండ్‌ను చూసి.. అంతకన్నా ముందుగానే విస్తరణ నిర్ణయాన్ని అమలు చేయాలని తాము భావిస్తున్నామని కల్యాణరామన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ముందుగా 2 నుంచి3 స్టోర్లతో కార్యకలాపాల విస్తరణను ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు చెప్పారు. ఫ్రాంఛైజీ పద్ధతిలో స్టోర్ ఏర్పాటుకు వ్యయం రూ. 20 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఇందులో ఎక్కువ వాటా ఉత్పత్తులదే ఉంటుందని, పెట్టుబడి వ్యయాలు తక్కువగానే ఉంటాయని వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీకి 21 రాష్ట్రాల్లో, నాలుగు దేశాల్లో.. మెుత్తం 151 సొంత స్టోర్లు ఉన్నాయి. వీటిలో అధికభాగం.. అంటే 121 స్టోర్స్ భారతదేశంలోనే ఉన్నాయి.
ఇవీ చదవండి..
Viral video: నోట్లో సిగార్.. చేతిలో విధ్వంసకర బాంబ్.. అతని కూల్ యాటిట్యూడ్ మీరూ చూడాల్సిందే..
EPF Alert: ఇకపై వారు రెండవ పీఎఫ్ ఖాతా ఓపెన్ చేయాల్సిందే.. ఎందుకో ఆ 5 కీలక అంశాలు తెలుసుకోండి..