దీపావళి వేళ జియో ఫైబర్ డబుల్ బోనాంజ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా అక్టోబర్ 18 నుంచి 28 మధ్య జియో ఫైబర్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ. 6,500 వరకు ప్రయోజనాలు అందించనుంది జియో. అయితే, కొత్త జియో ఫైబర్ ప్లాన్ తీసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇందులోనూ ఎంపిక చేసిన ప్లాన్స్‌కు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. రూ. 599(6 నెలలు), రూ.899(6 నెలలు) ప్లాన్స్ తీసుకునే వారికి ఈ ప్రయోజనాలు లభించనున్నాయి.
కొత్త జియో ఫైబర్ కనెక్షన్‌ను తీసుకునే కస్టమర్లు రూ. 599, రూ. 899 ప్లాన్‌లలో డబుల్ బోనాంజా ఆఫర్‌లో రెండు అదనపు ప్రయోజనాలు పొందుతారు. ఒకటి 100 శాతం వాల్యూ బ్యాక్, 15 రోజుల అదనపు వ్యాలిడిటీని ఉంటుంది. జియో ఫైబర్ తాజా ఆఫర్‌లో వినియోగదారులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం.
జియో ఫైబర్ రూ. 599 ప్లాన్ వినియోగదారులు 30Mbps వేగంతో ఇంటర్నెట్ సర్వీస్ పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు మొత్తం 14+ OTT యాప్‌లను ఫ్రీగా పొందుతారు. మొత్తంగా ఈ ప్లాన్‌లోని వినియోగదారులు ఆరు నెలల పాటు రూ. 4,241(రూ.3,594+రూ.647 జిఎస్‌టి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌ని తీసుకునే కొత్త కస్టమర్లు రూ. 4,500 విలువైన వోచర్లను పొందుతారు.
1. రూ.1,000 విలువైన AJIO వొచర్.
2. రూ.1,000 విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్.
3. రూ.1,000 విలువైన నెట్‌మెడ్స్ వోచర్.
4. రూ.1,500 విలువైన IXIGO వోచర్.
5. 6 నెలల వాలిడిటీతో పాటు, ఈ ప్లాన్‌లో కస్టమర్లు అదనంగా 15 రోజుల వ్యాలిడిటీని పొందుతారు.
జియో ఫైబర్ రూ. 899 ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులు 100 Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ సదుపాయాన్ని పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 14+ OTT యాప్‌లు, 550 ఆన్-డిమాండ్ ఛానెల్‌లకు యాక్సెస్ పొందుతారు. ప్లాన్‌ను రీఛార్జ్ చేయడానికి ఆరు నెలలకు రూ. 6,365(రూ.5,394 + రూ.971 జిఎస్‌టి) చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌లో భాగంగా వినియోగదారులు రూ. 6,500 విలువైన గిఫ్ట్ వోచర్ల ప్రయోజనాలు పొందనున్నారు.
1. రూ.2,000 విలువైన AJIO వోచర్.
2. రూ.1,000 విలువైన రిలయన్స్ డిజిటల్ వోచర్.
3. రూ.500 విలువైన నెట్‌మెడ్స్ వోచర్.
4. రూ.3,000 విలువైన IXIGO వోచర్.
5. 6 నెలల తరువాత 15 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది.
కస్టమర్లు ఈ ప్లాన్‌ను తీసుకోవడానికి రూ. 3,697(రూ.3,182+రూ.485) వెచ్చించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో కస్టమర్లు రూ. 3,500 విలువైన వోచర్లను పొందుతారు.
1. రూ.1,000 విలువైన AJIO వోచర్.
2. రూ.500 రిలయన్స్ డిజిటల్ వోచర్.
3. రూ.500 విలువైన నెట్‌మెడ్స్ వోచర్.
4. రూ.1,500 విలువైన IXIGO వోచర్.
5. దీనికి అదనపు వ్యాలిడిటీ ఏమీ ఉండదు.
కస్టమర్లు ఈ మూడు ప్లాన్‌లలో దేనిని ఎంచుకున్నా 4K JioFiber సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా పొందుతారు. వాస్తవానికి దీని ధర రూ.6,000. కానీ, ఆఫర్‌లో భాగంగా ఉచితంగా అందిస్తోంది జియో.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..