Wipro Chairman Rishad Premji: ‘అతనొక సీనియర్ అధికారి.. అయినా 10 నిముషాల్లో తొలగించాం’
మూన్‌లైటింగ్‌పై విప్రో కఠినంగా వ్యవహరిస్తోంది. గత నెలలో ఏకంగా 300 మంది ఉద్యోగులను తొలగించిన విప్రో.. తాజాగా కంపెనీ టాప్ 20 పొజిషన్లలో ఉన్న ఒక వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. పైగా నిబంధనల్ని అతిక్రమిస్తే..
మూన్‌లైటింగ్‌పై విప్రో కఠినంగా వ్యవహరిస్తోంది. గత నెలలో ఏకంగా 300 మంది ఉద్యోగులను తొలగించిన విప్రో.. తాజాగా కంపెనీ టాప్ 20 పొజిషన్లలో ఉన్న ఒక వ్యక్తిని నిర్ధాక్షిణ్యంగా తొలగించింది. పైగా నిబంధనల్ని అతిక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో సీనియర్ ఎంప్లయిస్‌కి కూడా ఎటువంటి మినహాయింపులు ఉండబోవని నాస్కమ్ ప్రొడక్ట్ కాన్‌క్లేవ్ బుధవారం (అక్టోబర్ 19) బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఈ మేరకు తెలిపారు. పెద్ద హోదాలో ఉన్న ఓ అధికారి నైతిక అతిక్రమణకు పాల్పడినందున తొలగించామన్నారు. కంపెనీకి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని తెలిసిన 10 నిముషాల్లోనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నిజానికి కంపెనీ వ్యవహారాల్లో అతను కీలక రోల్ పోషిస్తున్నాడు. కంపెనీ నిబంధనలను అతిక్రమించడం వల్ల అతని తొలగించామని రిషద్ పేర్కొన్నారు. మూన్‌లైటింగ్ అనేది పూర్తిగా నైతిక అతిక్రమణ కిందకి వస్తుందని చెప్పిన రిషద్ సదరు వ్యక్తి మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారా? లేదా ఇతర నిబంధనలను ఉల్లంఘించారా అనే విషయం మాత్రం వెల్లడించలేదు.
కాగా ఇప్పటికే 300 మంది ఉద్యోగులను తొలగించడంపై విమర్శలను ఎదుర్కొంటున్న విప్రో తన నిర్ణయాన్ని మరింత బలోపేతం చేసేందుకు నింబంధనలను రెట్టింపు చేసింది. సైడ్ జాబ్స్ బాగానే ఉన్నా, కంపెనీ కోసం పనిచేయడం అనేది ‘క్వశ్చన్ ఆఫ్ ఎథిక్స్’ అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ థియరీ డెలాపోర్టే