AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio 5 New Data Plans : జియో కస్టమర్స్ కు శుభవార్త.. 5 కొత్త డేటా ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డేటా వాడకం ఎక్కువ అయ్యింది. ఇక ముఖ్యంగా జియో అడుగు పెట్టిన తర్వాత డేటా వాడకం మరింత అధికమయ్యింది. తన కస్టమర్ల కోసం...

Jio 5 New Data Plans : జియో కస్టమర్స్ కు శుభవార్త.. 5 కొత్త డేటా ప్లాన్స్ ప్రకటించిన రిలయన్స్ జియో
Surya Kala
|

Updated on: Mar 05, 2021 | 4:24 PM

Share

Jio 5 New Data Plans : స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత డేటా వాడకం ఎక్కువ అయ్యింది. ఇక ముఖ్యంగా జియో అడుగు పెట్టిన తర్వాత డేటా వాడకం మరింత అధికమయ్యింది. తన కస్టమర్ల కోసం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్స్ ను లాంచ్ చేసింది. అయితే తాజాగా ఎక్కువ డేటా అఫర్ చేసే ఐదు కొత్త డేటా ప్లాన్స్ కూడా విడుదల చేసింది. ఈ డేటా ప్లాన్స్ కేవలం 22 రుపాయల నుండి ప్రారంభమవుతాయి. అయితే ఈ 5 కొత్త డేటా ప్లాన్స్ అన్ని కూడా 28 రోజుల వ్యాలిడిటీ తో వస్తాయి. ప్రస్తుతం వినియోగదారుల డేటా అవసరాలను దృష్టి లో పెట్టుకుని ఈ ప్లాన్స్ ను తీసుకుని వచ్చినట్లు అర్ధమవుతుంది. అయితే ఈ డేటా ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నవారికి ఎటువంటి వాయిస్ లేదా ఎస్ఎంఎస్ సేవలను అందించవు.

జియోఫోన్ 5 కొత్త డేటా ప్లాన్స్ వివరాలు :

1. Rs. 22 రూపాయల ప్లాన్:

రూ.22 లతో రీచార్జ్ చేసుకుంటే 2GB డేటాని 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. అయితే ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.

2. Rs. 52 రూపాయల ప్లాన్:

ఈ డేటా ప్లాన్ లో రూ. 52లతో రీఛార్జ్ చేసుకుంటే 6GB డేటాని పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.

3. Rs. 72 రూపాయల ప్లాన్:

ఈ డేటా ప్లాన్ కేవలం రూ. 72 ధరలో లభిస్తుంది. అయితే డైలీ 0.5GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 14GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.

4. Rs. 102 రూపాయల ప్లాన్:

ఈ డేటా ప్లాన్ కేవలం రూ.102 ధరలో అందిస్తుంది. డైలీ 1GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 28GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.

5. Rs. 152 రూపాయల ప్లాన్:

ఈ డేటా ప్లాన్ కేవలం రూ. 152 ధరలో డైలీ 2GB డేటాతో పూర్తి 28 రోజుల వ్యాలిడిటీకి గాను మొత్తంగా 56GB డేటా అందిస్తుంది. ఈ డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 64Kbps కి తగ్గించబడుతుంది.

Also Read:

అదృష్టం అంటే అతడిదే.. యూఏఈలో లాటరీతో రూ.24 కోట్లు గెలుచుకున్న భారతీయుడు..

ఆ విషయాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి.. స్వయం సహాయక సంఘాలపై సమీక్షలో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆదేశం