AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office: పోస్టల్ శాఖలో లక్ష పెట్టుబడితో రూ.40వేల వడ్డీ.. ప్రధాని మోదీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు తెలుసా..?

National Savings Certificates: సామాన్యులను దృష్టిలో ఉంచుకుని వారికి మరింత ప్రయోజనం చేకూరేలా పథకాలను ప్రవేశపెడుతూ ప్రస్తుతం పోస్టల్ శాఖ దూసుకుపోతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి

Post Office: పోస్టల్ శాఖలో లక్ష పెట్టుబడితో రూ.40వేల వడ్డీ.. ప్రధాని మోదీ కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు తెలుసా..?
Shaik Madar Saheb
|

Updated on: Mar 05, 2021 | 7:43 PM

Share

National Savings Certificates: పోస్టల్‌ డిపార్ట్‌మెంట్ రోజురోజుకు కొత్త స్కీమ్‌లతో ప్రజలకు చేరువవుతున్న సంగతి తెలిసిందే. సామాన్యులను దృష్టిలో ఉంచుకుని వారికి మరింత ప్రయోజనం చేకూరేలా పథకాలను ప్రవేశపెడుతూ ప్రస్తుతం పోస్టల్ శాఖ దూసుకుపోతోంది. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పోస్టల్ శాఖకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కొన్ని సార్లు ప్రచారం కూడా నిర్వహించారు. దీంతో పోస్టల్ బీమా పాలసీల పట్ల ప్రజలకు మక్కువ పెరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) కూడా పోస్టల్ డిపార్ట్‌మెంట్ పెట్టుబడులు పెట్టారు. స్వయంగా ప్రధాని మోదీనే పోస్టల్ శాఖలో పెట్టుబడులు పెట్టారంటే.. సాధారణ ప్రజలకు నమ్మశక్యంగా ఉండదు. కానీ నిజంగా ప్రధాని మోదీ.. పెట్టుబడులు పెట్టారు. గతేడాది గణాంకాల ప్రకారం.. ప్రధాని 84వేలకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. ఈ పోస్టాఫీసు పథకం గురించి తెలుసుకోండి..

లక్ష పెట్టుబడితో.. లక్షా 40 వేలు.. National Savings Certificate పథకంలో ఒకేసారి పెట్టుబడి పెట్టేవచ్చు. లేకపోతే.. కనీసం 100 నుంచి 1000 వరకు జమచేసుకోవచ్చు. ఈ పథకం కాలవ్యవధి 5 ​​సంవత్సరాలు. ఈ పథకంపై పోస్టల్ శాఖ 6.8 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ వడ్డీని వార్షిక ప్రాతిపదికన లెక్కించి.. మెచ్యూరిటీపై వడ్డీని చెల్లిస్తారు. పెట్టుబడికి గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. దీనిలో పెట్టబడి పెడితే కనీసం లక్షన్నర వరకు పొందవచ్చని పేర్కొంటున్నారు.

6.8% వడ్డీ రేటు:

ప్రతీ మూడు నెలలకొకసారి వడ్డీ రేటుపై ప్రభుత్వం సమీక్షిస్తుంది. పెట్టుబడిదారులు వార్షిక ప్రాతిపదికన మొత్తం పెట్టుబడిపై వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. దీని కింద మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెడితే ఐదేళ్ల తర్వాత మీ మొత్తం 1389.49 రూపాయలు అవుతుంది. అంటే వడ్డీ ఆదాయం రూ .389.49. ఈ విధంగా 10వేలు పెట్టుబడి పెడితే.. వడ్డీ ద్వారా ఆదాయం 3, 890 రూపాయలు వస్తుంది. ఇలా లక్ష పెట్టుబడికి వడ్డీగా 38,949 రూపాయలు వస్తాయి. ఈ పథకం పోస్టాఫీసులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 18 ఏళ్లపైన వారు.. లేదా మైనర్లు ఉంటే.. ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతా (Post Office Saving Scheme)ను తెరవచ్చు. ఐదేళ్ల ముందు ఈ పథకాన్ని నిలుపుదల చేయరు. మరిన్ని వివరాల కోసం మీ దగ్గర్లోని పోస్టాఫీసులో సంప్రదించండి.

Also Read:

ఇండిగో విమానంలో కోవిడ్ పేషెంట్ కలకలం.. అప్రమత్తమైన క్యాబిన్ సిబ్బంది.. శానిటైజ్ చేశాక టేక్-ఆఫ్ అయిన ఫ్లైట్

పెళ్లి సమయంలో బట్టతలను దాచిన భర్త.. ఏడాది తర్వాత విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన భార్య