AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ విషయాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి.. స్వయం సహాయక సంఘాలపై సమీక్షలో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆదేశం

తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ ప్రైస్, డెవలప్ మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక..

ఆ విషయాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టాలి.. స్వయం సహాయక సంఘాలపై సమీక్షలో సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆదేశం
K Sammaiah
|

Updated on: Mar 05, 2021 | 3:50 PM

Share

తెలంగాణలో స్వయం సహాయక సంఘాలకు సంబంధించి ఐటి వినియోగం, సామర్ధ్యం పెంపుదల, జీవనోపాధి, ఎంటర్ ప్రైస్, డెవలప్ మెంట్, కన్వర్ జెన్సీకి కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి SERP, MEPMA లు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, కార్యాచరణ ప్రణాళికలపై శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళల జీవనోపాధిలో మార్పు తీసుకురావడానికి వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, Soil testing, కూరగాయల సాగు, పశుసంవర్ధకం న్యూట్రేషన్ తదితర రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి అంశానికి సంబంధించి అధికారులతో small groups ఏర్పాటు చేసి వివరాలతో రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఐటి వినియోగం ద్వారా SHG గ్రూపులకు నిరంతర సేవలందించాలని, ప్రతి గ్రూప్ కు బ్యాంక్ లింకేజ్ అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో చిన్నారులలో మాల్ న్యూట్రీషన్, మహిళలలో అనీమియా తగ్గించడానికి SHG లు, సంబంధిత లైన్ డిపార్టుమెంట్స్ కన్వర్జెన్సీ తో కృషి చేయాలని అధికారులను కోరారు.

ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ బి.జనార్దన్ రెడ్డి, యస్సి అభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ రాహుల్ బొజ్జా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా చోంగ్తు, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ రోనాల్డ్ రోస్, జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, CDMA శ్రీ సత్యనారాయణ, Lead-IBCD SISD HR, Govt. of India, ఉషారాణి, హార్టీకల్చర్ డైరెక్టర్ శ్రీ ఎల్. వెంకట్రాం రెడ్డి, అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ జి. లక్ష్మీబాయి, స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డైరెక్టర్ శ్రీ అఖీల్, WE Hub సిఈఓ దీప్తి రేవుల, శ్రీనిధి యండి శ్రీ జి.విద్యాసాగర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

Read More:

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతుంది.. మేకిన్‌ ఇండియా అనగానే కంపెనీలు క్యూ కడతాయా..? -మంత్రి కేటీఆర్‌

ఆ మానుకోట రాళ్ల కిందే రాజకీయ సమాధి చేస్తాం.. బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్‌ ఫైర్‌