తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతుంది.. మేకిన్‌ ఇండియా అనగానే కంపెనీలు క్యూ కడతాయా..? -మంత్రి కేటీఆర్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతుందని..

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతుంది.. మేకిన్‌ ఇండియా అనగానే కంపెనీలు క్యూ కడతాయా..? -మంత్రి కేటీఆర్‌
Follow us

|

Updated on: Mar 05, 2021 | 5:17 PM

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అడుగడుగునా అడ్డుపడుతుందని ఆరోపించారు.మేక్‌ ఇన్‌ ఇండియా… ఆత్మ నిర్భర్‌ భారత్‌. నినాదాలు బాగున్నాయి సరే… అమలు తీరు ఇదేనా అని కేంద్రాన్ని ప్రశ్నించారు కేటీఆర్‌. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌… ITIR ఏదని నిలదీశారు. ఆరున్నరేళ్ల కిందట ఇచ్చిన విభజన హామీల సంగతేంటని ప్రశ్నించారు. ప్రాజెక్ట్‌ రిపోర్టులు పంపినా, ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా… కనీసం పట్టించుకోవడం లేదని, తెలంగాణ ఈ దేశంలో లేదా అని నిలదీశారు. CII వార్షిక సమావేశంలో… కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు

మేక్‌ ఇన్‌ ఇండియా అని చెబుతున్న కేంద్రం… ఫార్మా రంగంలో చైనా నుంచే ఎక్కువగా దిగమతులు చేసుకుంటోందన్నారు. హైదరాబాద్‌ అతిపెద్ద ఫార్మా పార్క్‌ పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. ప్రపంచానికే వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాద్‌… టెస్టింగ్‌ ల్యాబ్‌ను ఎందుకు కేటాయించలేదని కూడా ప్రశ్నించారు కేటీఆర్‌. ప్రపంచంలోనే 35 శాతం వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని, టెస్టింగ్‌ కోసం మాత్రం 1200 కిలోమీటర్ల దూరంలోని ల్యాబ్‌కు వెళ్లాలా… అని నిలదీశారు.

దిగుమతి సుంకాలు పెంచి.. మేకిన్‌ ఇండియా అంటే కంపెనీలు వస్తాయా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్రాన్ని ప్రశ్నించారు. శుక్రవారం బేగంపేటలో సీసీఐ రాష్ట్ర వార్షిక సమావేశం జరిగింది. కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మనిర్భర్‌ భారత్‌ నినాదం ఇస్తే సరిపోదు.. ఇందుకు తగిన చర్యలు కూడా చేపట్టాలన్నారు. ఇండియా టీకాల రాజధానిగా తెలంగాణ మారిందన్నారు.

ఐటీ, లైఫ్‌ సెన్సెస్‌, ఫార్మా, నిర్మాణ రంగాల్లో అగ్రస్థానంలో ఉన్నామన్నారు కేటీఆర్‌. ఐటీ ఎగుమతులు రూ.1.40లక్షల కోట్లకు చేరాయని, స్టార్టప్‌లతో తెలంగాణ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారుతోందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారని, స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిఫెన్స్‌, ఏరోస్పేస్‌ రంగానికి హైదరాబాద్‌ నిలయంగా ఉందన్నారు.

తెలంగాణకు ఇచ్చిన ఏ హామీని కేంద్రం నిలబెట్టుకోలేదని, అలాగే విభజన సమస్యలు పరిష్కరించలేదని కేటీఆర్‌ అన్నారు. గత ఆరేండ్లలో తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక రాయితీలు ఇవ్వలేదని గుర్తు చేశారు. వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామన్నారని, కోచ్‌ ఫ్యాక్టరీకి 60 ఎకరాలు అడిగితే 150 ఎకరాలు ఇచ్చామన్నారు. ఐటీఐఆర్‌ రద్దు చేసి, తెలంగాణకు అన్యాయం చేశారని, తెలంగాణకు ఒక్క ఇండస్ట్రియల్‌ జోన్‌ ఇవ్వలేదని ఆరోపించారు.

బయ్యారం ఉక్కు ఊసేలేదన్నారు మంత్రి కేటీఆర్‌. కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు. కేంద్రం ఎన్నికల కోసం కాకుండా.. ప్రజల కోసం, దేశం కోసం పని చేయాలన్నారు. రాష్ట్రం నుంచే అధిక రెవెన్యూ తీసుకుంటూ అన్యాయం చేస్తున్నారన్నారు. బుల్లెట్‌ రైలు గుజరాత్‌కేనా.. హైదరాబాద్‌కు అర్హత లేదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

Read More:

ఆ మానుకోట రాళ్ల కిందే రాజకీయ సమాధి చేస్తాం.. బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్‌ ఫైర్‌

మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మాకేం తక్కువ.. వాళ్లే కాదు మేము అందమగానే ఉంటాం..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??