ITR FIling: ఫోన్‌పే యాప్‌లో ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త ఫీచర్.. డిపార్ట్‌మెంట్ పోర్టల్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు
PhonePe: డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పేలో ఇన్‌కమ్ ట్యాక్స్ అనే కొత్త ఫీచర్ ప్రారంభించింది. ఇది చాలా సులభంగా పన్నులు చెల్లించడానికి సహాయపడుతుంది.
ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ నడుస్తోంది. అంతా తమ టాక్స్ కట్టే పనిలో బిజీగా ఉన్నారు. సీఏల వద్ద పెద్ద క్యూ కనిపిస్తోంది. మరికొందరు స్వయంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, అలా కాకుండా ఫోన్‌పే ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. ఆదాయపు పన్ను చెల్లింపు అనే కొత్త ఫీచర్ కోసం డిజిటల్ B2B వ్యాపార సంస్థ Paymateతో భాగస్వామ్యం చేసుకుంది. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌లో ఐటీఆర్‌ను ఫైల్ చేయడంలో సమస్యలు ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. దీన్ని నివారించడానికి ఫోన్ పేలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఫీచర్‌ని తీసుకొచ్చారు.. దీంతో మీరు స్వయంగా టాక్స్ పే చేసుకోవచ్చు.
ఫోన్ పేపై క్రెడిట్ కార్డ్ లేదా UPI ఉపయోగించి పన్ను చెల్లించవచ్చు. మీరు కొన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించినట్లయితే మీరు రివార్డ్‌లను కూడా పొందవచ్చు.
- ఫోన్ చెల్లింపుపై పన్ను ఎలా చెల్లించాలి?
- మొబైల్‌లో ఫోన్ పే యాప్‌ను తెరవండి
- హోమ్ పేజీలోని రీఛార్జ్, చెల్లింపు బిల్లుల స్లాట్‌లో ఆదాయపు పన్ను ఫీచర్‌ను చూడవచ్చు. దాన్ని క్లిక్ చేయండి
- ప్రస్తుత అసెస్‌మెంట్ సంవత్సరంలో మీరు చెల్లించాల్సిన పన్నును ఎంచుకోండి పాన్ కార్డ్ వివరాలు ఇవ్వండి
- పన్ను మొత్తాన్ని నమోదు చేయండి. క్రెడిట్ కార్డ్ లేదా UPI ద్వారా చెల్లించండి మీ చెల్లింపు రెండు పని దినాలలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించబడుతుంది.
ఏడు కోట్ల మందికి పైగా ఐటీఆర్ సమర్పణ..
ఆదాయపు పన్ను పోర్టల్‌లో మొత్తం 11.39 కోట్ల మంది వ్యక్తిగత రిజిస్టర్లు ఉన్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం 7.40 కోట్ల మందికి పైగా ఐటీఆర్ దాఖలు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఐటీఆర్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో 5 కోట్లకు పైగా పన్ను పరిధిలోకి రానివి ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం