Treasury Bills: ట్రెజరీ బిల్లులు అంటే ఏమిటి..? ఇవి ఎఫ్‌డీల కంటే ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయా?
ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నందున ట్రెజరీ బిల్లులను కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం పరిగణనలోకి తీసుకోండి. ఇందులో ఒక సంవత్సరం తర్వాత మీరు మీ అసలు మొత్తాన్ని నిర్దిష్ట వడ్డీతో పాటు తిరిగి పొందుతారు. ప్రభుత్వం తరపున RBI వీటిని జారీ చేస్తుంది. ఇది దాదాపు ప్రతి వారం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం ట్రెజరీ బిల్లులను ఎందుకు జారీ చేస్తుంది అని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? హైవేలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు వంటి భారీ మౌలిక సదుపాయాల..
రామ్ ప్రతాప్ తన పక్కనే ఉండే సాగర్ వద్దకు వచ్చి తన డబ్బులో కొంత ఒక సంవత్సరం కాలం ఇన్వెస్ట్ చేయడం కోసం బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లను తనిఖీ చేయమని అడిగాడు. అదేంటి ఎఫ్‌డీలలో మాత్రమే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారు అని అడిగాడు సాగర్. మీరు వేరే చోట కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు అని చెప్పాడు. FDలు సూరక్షితమైనవనీ.. మంచి వడ్డీ రేట్లు వస్తాయనీ రామ్ ప్రతాప్ చెప్పారు. దానికి ఇది నిజమే.. కానీ.. FDల కంటే సురక్షితమైన.. ఎక్కువ రాబడి ఇచ్చే ట్రెజరీ బిల్లులు వంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాలు కూడా ఉన్నాయని సాగర్ అన్నాడు. దానికి అవునా.. ట్రెజరీ బిల్లులు ఏమిటి? ఇది నాకు తెలీదు అని చెప్పాడు రామ్ ప్రతాప్
ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తున్నందున ట్రెజరీ బిల్లులను కూడా ఇన్వెస్ట్మెంట్ కోసం పరిగణనలోకి తీసుకోండి. ఇందులో ఒక సంవత్సరం తర్వాత మీరు మీ అసలు మొత్తాన్ని నిర్దిష్ట వడ్డీతో పాటు తిరిగి పొందుతారు. ప్రభుత్వం తరపున RBI వీటిని జారీ చేస్తుంది. ఇది దాదాపు ప్రతి వారం అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వం ట్రెజరీ బిల్లులను ఎందుకు జారీ చేస్తుంది అని ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారా? హైవేలు, ఆసుపత్రులు, విమానాశ్రయాలు వంటి భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వానికి డబ్బు అవసరం. కేవలం పన్ను వసూలు మాత్రమే ప్రభుత్వ ఖర్చులను పూర్తిగా భర్తీ చేయలేవు. ట్రెజరీ బిల్లుల ద్వారా దీనిని సేకరిస్తుంది. అంటే.. దీని అర్థం ట్రెజరీ బిల్లులో పెట్టుబడి పెట్టడం అంటే ప్రభుత్వానికి రుణం ఇవ్వడంతో సమానం. దీని ద్వారా ప్రభుత్వం స్వల్పకాలిక నిధులను సేకరిస్తుంది.
అయితే బాండ్ .. ట్రెజరీ బిల్లు మధ్య తేడా ఏమిటి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ రెండూ ప్రభుత్వ సెక్యూరిటీలు. దీని ద్వారా ప్రభుత్వం సంస్థలు లేదా సామాన్య ప్రజల నుంచి డబ్బు తీసుకుంటుంది. ఒకే తేడా ఏమిటంటే బాండ్స్ 365 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాల పరిమితితో ఉంటాయి. ట్రెజరీ బిల్లులు గరిష్టంగా 364 రోజుల వ్యవధిని కలిగి ఉంటాయి. అంటే ఒక సంవత్సరం కంటే తక్కువ అన్న మాట. అలాగే ట్రెజరీ బిల్లులో మూడు రకాలు ఉన్నాయి.. 91 రోజుల ట్రెజరీ బిల్లు, 182 రోజుల ట్రెజరీ బిల్లు, 364 రోజుల ట్రెజరీ బిల్లు.
ఇప్పుడు ట్రెజరీ బిల్లులు ఎలా పని చేస్తాయి?
ట్రెజరీ బిల్లులు ముఖ విలువకు తగ్గింపుతో జారీ చేయబడతాయి. మీరు 100 రూపాయల ట్రెజరీ బిల్ యూనిట్‌ని కొనుగోలు చేశారనుకుందాం.. దానిపై మీకు 2 రూపాయల తగ్గింపు ఉంటుంది. అందుకే మీరు దానికి కేవలం 98 రూపాయలు మాత్రమే చెల్లించాలసి ఉంటుంది. మెచ్యూరిటీపై మీ ఈ యూనిట్ రూ.100కి అమ్మవచ్చు. అంటే మీరు యూనిట్‌కు 2 రూపాయల లాభం పొందుతారు.
ట్రెజరీ బిల్లులపై రాబడి ఎలా ఉంటుంది?
పైన చెప్పిన విధంగా ట్రెజరీ బిల్లుపై కచ్చితమైన రాబడి హామీ ఉంటుంది. ఇది ముందే నిర్ణయం అయిపోయింది. కాబట్టి మీరు రాబడి ఎంత ఉంటుందో కూడా లెక్కించవచ్చు. అంటే మీ పెట్టుబడిపై ఎంత రాబడి వస్తుంది అనే విషయాన్ని ముందే మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు.
ట్రెజరీ బిల్లులను జీరో కూపన్ షార్ట్ టర్మ్ డెట్ సెక్యూరిటీస్ అంటారు. ఎందుకంటే వాటిపై ప్రత్యేక వడ్డీ చెల్లించరు. ఇక్కడ మీరు వడ్డీ ఇవ్వకపోతే మనకు రాబడి ఎక్కడి నుంచి వస్తుంది అని ఆలోచించవచ్చు. మీరు 91 రోజుల ట్రెజరీ బిల్లు యూనిట్‌ని రూ.98కి కొన్నారనుకోండి… దాని నిజమైన విలువ రూ. 100… అంటే మీరు యూనిట్‌కు రూ.2 తగ్గింపుతో దాన్ని పొందారు. 91 రోజుల తర్వాత మెచ్యూరిటీ తర్వాత, మీరు యూనిట్‌కు రూ. 2 లాభాన్ని పొందుతారు. అందుకే వార్షిక రాబడి పరంగా వచ్చే లాభాన్ని దిగుబడి అంటారు.
మీరు దీన్ని ఈ ఫార్ములాతో లెక్కించవచ్చు… Y= (100-P)/Px[(365/D)x100] … ఇక్కడ Y అనేది శాతంలో రాబడి, P అనేది తగ్గింపు ధర బిల్లు .. D అనేది బిల్లు మెచ్యూరిటీ వ్యవధి రోజులలో. ప్రస్తుత ఉదాహరణలో మీ దిగుబడి 8.18 శాతం ఉంటుంది. అంటే, ఈ ట్రెజరీ బిల్లుపై మీకు 8.18 శాతం వార్షిక రాబడి వస్తుందని, ఇటీవల రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన ట్రెజరీ బిల్లుల్లో దిగుబడి 6.7 నుంచి 7.2 శాతం ఉండవచ్చని సూచించింది. ట్రెజరీ బిల్లులను కొనుగోలు చేయడానికి, మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నేరుగా ట్రెజరీ బిల్లులలో పెట్టుబడి పెట్టవచ్చు.
ఇప్పుడు దానిపై టాక్స్ లు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని చూద్దాం.. ట్రెజరీ బిల్లులు ఒక సంవత్సరం కంటే తక్కువ మెచ్యూరిటీని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిలో వచ్చే లాభాలను స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారని టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుడు బల్వంత్ జైన్ చెప్పారు. ఇన్వెస్టర్ అతని పన్ను స్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాలి.
ట్రెజరీ బిల్లుపై వచ్చే లాభం మీ ఆదాయానికి యాడ్ అవుతుంది. అందువల్ల మీరు మీ పన్ను స్లాబ్ ప్రకారం దానిపై పన్ను చెల్లిస్తారు… మరోవైపు, మనం ఎఫ్‌డీపై పన్ను గురించి చూసినట్లయితే, వృద్ధులకు రూ. 50,000 వరకు వడ్డీ ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. దీని పైన వడ్డీపై 10% టీడీఎస్ తీసివేయబడుతుంది. డిడక్ట చేస్తారు. అదేవిధంగా మిగిలిన పౌరులకు, రూ. 40,000 వరకు వార్షిక ఆదాయం పన్ను రహితంగా ఉంటుంది. కానీ అంతకంటే ఎక్కువ వడ్డీ ఆదాయం కోసం, 10% టీడీఎస్ కట్ చేస్తారు. ఒక అధ్యయనం ప్రకారం, 70% సమయం ట్రెజరీ బిల్లులు బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ రాబడిని ఇస్తాయని గమనించారు. ట్రెజరీ బిల్లుల ఒక ప్రయోజనం ఏమిటంటే అవి మార్కెట్ లింక్‌తో ఉంటాయి. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచినప్పుడు.. అవి రేట్లపై తక్షణ ప్రభావం చూపుతాయి. కానీ బ్యాంకులు ఎఫ్‌డిలపై రేట్లు పెంచడంలో ఆలస్యం చేయడం తరచుగా కనిపిస్తుంది. అంటే పెంపు ప్రయోజనాన్ని వెంటనే ఇవ్వవు. ట్రెజరీ బిల్లు ప్రభుత్వం జారీ చేసిన సెక్యూరిటీ, కాబట్టి ఇది సురక్షితమైనది. దీనికి 100% ప్రభుత్వ హామీ ఉంది.
ఈ విధంగా, ట్రెజరీ బిల్లులు ఎఫ్‌డీ కంటే సురక్షితమైనవి అని మీరు చెప్పవచ్చు. దీనికి ప్రభుత్వం హామీ ఇస్తుంది. అందుకేఇది పూర్తిగా రిస్క్ ఫ్రీ. ఎమర్జెన్సీ సమయంలో ఎఫ్‌డీని బ్రేక్ చేయడం ద్వారా డబ్బును విత్‌డ్రా చేసుకున్నట్లే, ఫైనాన్షియల్ మార్కెట్‌లలో ట్రెజరీ బిల్లులను విక్రయించడం ద్వారా డబ్బును తీసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో ట్రెజరీ బిల్లులు, ఎఫ్‌డీలు రెండింటినీ తాకట్టు పెట్టి కూడా రుణం తీసుకోవచ్చు. కాబట్టి మొత్తం మీద రామ్ ప్రతాప్ ట్రెజరీ బిల్లులలో పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రశాంతంగా ఉండవచ్చని చెప్పవచ్చు. అతని డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది… అలాగే మంచి రాబడిని కూడా ఇస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి