Chip Unit: బెంగళూరులో చిప్‌ల తయారీ యూనిట్.. 3000కు పైగా ఉద్యోగాలు
బెంగళూరులో అతిపెద్ద ఆర్ అండ్ డి యూనిట్‌ను కలిగి ఉండాలన్న ఏఎండీ నిర్ణయాన్ని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు. ఈ చర్య నైపుణ్యం కలిగిన సెమీకండక్టర్ ఇంజనీర్లకు ఉపాధిని అందించడమే కాకుండా, భారతదేశం గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మారాలన్న ప్రధాని మోదీ దార్శనికతను సాకారం చేస్తుంది. భారతదేశంలోని గ్లోబల్ ఆర్ అండ్ డి వర్క్‌ఫోర్స్‌లో 48% బెంగళూరుకు చెందినవారు. భారతదేశంలో..

శాంటా-క్లారా (కాలిఫోర్నియా) ఆధారిత సెమీకండక్టర్ తయారీదారు ఏఎండీ బెంగళూరులో ఐదేళ్లలో 400 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది . గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరిగిన ‘సెమికాన్ ఇండియా-2023’లో ఏఎండీ మార్క్ పేపర్‌మాస్టర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మాట్లాడుతూ , బెంగళూరులో అతిపెద్ద రీసెర్చ్ అండ్ డెవలప్ (ఆర్‌అండ్‌డి) కేంద్రాన్ని ప్రారంభించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం చివరిలోపు ఆర్‌అండ్‌డి కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏఎండీ ఎదురుచూస్తోందని పేపర్‌మాస్టర్ తెలిపారు. దాదాపు 3,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని భావిస్తోందని న్యూస్ 9 నివేదించింది.
అదే సమయంలో బెంగళూరులో అతిపెద్ద ఆర్ అండ్ డి యూనిట్‌ను కలిగి ఉండాలన్న ఏఎండీ నిర్ణయాన్ని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు. ఈ చర్య నైపుణ్యం కలిగిన సెమీకండక్టర్ ఇంజనీర్లకు ఉపాధిని అందించడమే కాకుండా, భారతదేశం గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మారాలన్న ప్రధాని మోదీ దార్శనికతను సాకారం చేస్తుంది. భారతదేశంలోని గ్లోబల్ ఆర్ అండ్ డి వర్క్‌ఫోర్స్‌లో 48% బెంగళూరుకు చెందినవారు. భారతదేశంలో పనిచేస్తున్న మొత్తం ప్రపంచ ఆర్ అండ్ డి యూనిట్ల సంఖ్య 1,150 కంటే ఎక్కువ.
కోవిడ్ మహమ్మారి తర్వాత సరఫరాలో అంతరాయాలతో చిప్ తయారీ లేదా సెమీకండక్టర్ తయారీ రంగం దెబ్బతింది. చైనాపై మితిమీరిన ఆధారపడటం కూడా దానికి కారణం. ఎఎమ్‌డి వంటి ప్రధాన చిప్ తయారీ సంస్థ దేశంలో యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నందున చిప్ తయారీకి అనువైన గమ్యస్థానంగా భారత్ గుర్తిస్తుందని చెప్పారు.




మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి