Best CNG SUV: సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా..? ఆ మూడు కార్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటంటే..?

| Edited By: Ram Naramaneni

Aug 11, 2024 | 10:09 PM

కారు అంటే పెట్రోలు లేదా డీజిల్ తో నడుస్తుందని మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఇందన ధరల నేపథ్యంలో చాలా మంది ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది మాత్రం ఈవీ కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ కార్లను ఎంచుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఇటీవల సీఎన్‌జీ (కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్) కార్ల వినియోగం బాగా పెరిగింది. పెట్రోలు కంటే సీఎన్ జీ ధర తక్కువగా ఉండడంతో చాలామంది ఈ కార్లపై ఆసక్తి చూపుతున్నారు.

Best CNG SUV: సీఎన్జీ కార్లలో బెస్ట్ ఇదేనా..? ఆ మూడు కార్ల మధ్య ప్రధాన తేడాలు ఏంటంటే..?
Cng Cars
Follow us on

కారు అంటే పెట్రోలు లేదా డీజిల్ తో నడుస్తుందని మనకు తెలిసిందే. ఇటీవల కాలంలో పెరుగుతున్న ఇందన ధరల నేపథ్యంలో చాలా మంది ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది మాత్రం ఈవీ కార్లకు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ కార్లను ఎంచుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో ఇటీవల సీఎన్‌జీ (కంప్రెస్ట్ నేచురల్ గ్యాస్) కార్ల వినియోగం బాగా పెరిగింది. పెట్రోలు కంటే సీఎన్ జీ ధర తక్కువగా ఉండడంతో చాలామంది ఈ కార్లపై ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా వివిధ కంపెనీలు సీఎన్ జీ వేరియంట్ కార్లను తయారు చేస్తున్నాయి.  వాటిలో హ్యుందాయ్ ఎక్స్ టర్, టాటా పంచ్, మారుతీ ప్రాంక్స్ (సీఎన్‌జీ ఎస్‌యూవీలు)  ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఈ కార్లల్లో ఏ కారు మైలేజ్‌తో పాటు మంచి ఫీచర్లతో వస్తుందో? ఓ సారి తెలుసుకుందాం.

హ్యుందాయ్ ఎక్స్ టర్ ఎస్‌యూవీ

హ్యుందాయ్ మోటార్ కంపెనీ ఇటీవల ఎక్స్ టర్ ఎస్ యూవీని విడుదల చేసింది. సీఎన్ జీ వెర్షన్ లో డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో దీన్ని పరిచయం చేసింది. ఈ కారుకు టాటా పంచ్, మారుతీ ఫ్రాంక్స్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. దేశంలోని దాదాపు అన్ని ఎంట్రీ లెవెల్ ఎస్ యూవీ సెగ్మెంట్ల మోడళ్లలో సీఎన్జీ పవర్ ట్రెయిన్ అప్ డేట్ చేశారు. దీనిలో భాగంగా హ్యుందాయ్ కంపెనీ తన చిన్న ఎస్ యూవీ ఎక్స్‌టర్‌కు సీఎన్జీ సాంకేతికతను జోడించింది. మైలేజీ పరంగా ఏఆర్ఏఐ గణాంకాల ప్రకారం.. హ్యందాయ్ ఎక్స్ టర్ సీఎన్ జీ ఎస్ యూవీ 27.1 కిలోమీటర్లు/కేజీ ఇంధన సామర్థం కలిగి ఉంది. దీనిలోని పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 19.4, ఆటోమేటిక్ వెర్షన్ 19.2 మైలేజీని అందిస్తాయి.

మారుతి ఫ్రాంక్స్ సీఎన్జీ

హ్యుందాయ్ ఎక్స్ టర్ కు ప్రధాన ప్రత్యర్థి అయిన మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ మాత్రం రెండు ఇంజిన్ల ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చింది. ఈ సీఎన్జీ వెర్షన్ ఎస్ యూవీ కి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ ఏర్పాటు చేశారు. దీనిని ఐదు స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎంటీ జియాబాక్స్‌తో జత చేశారు. ఫ్రాంక్స్ సీఎన్జీ 76 బీహెచ్ పీ శక్తి, 98 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఎక్స్‌టర్ కంటే ఫ్రాంక్స్ శక్తివంతంగా పని చేస్తుంది. ఏఆర్ఏఐ ధ్రువీకరించిన వివరాల ప్రకారం.. మారుతీ ఫ్రాంక్స్ సీఎన్జీ 28.51 కేఎం/కేజీ మైలేజీ ఇస్తుంది. దీనికి ఎక్స్‌టర్ కంటే ఎక్కువ ఇంధన సామర్థ్యం ఉంది. ఈ ఎస్ యూవీ పెట్రోల్ వెర్షన్ మాన్యువల్ వేరియంట్‌లో 21.79, ఆటోమేటిక్ వేరియంట్‌లో 22.89 మైలేజీ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

టాటా పంచ్ సీఎన్జీ

హ్యుందాయ్ ఎక్స్ టర్ కు మరో ప్రత్యర్థి అయిన టాటా పంచ్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రస్తుతం కార్ల అమ్మకాలలో దేశంలోనే ముందుంది. అత్యంత ప్రజాదారణ పొందింది. ఈ ఎస్ యూవీ 1.2 లీటర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లకు జత చేశారు. 2023లో ఆల్ట్రోజ్ హ్యాచ్‌బ్యాక్‌లో టాటా మోటార్‌ తొలిసారిగా ప్రవేశపెట్టిన డ్యూయల్-సిలిండర్ టెక్నాలజీని దీనిలో వాడారు. పంచ్ సీఎన్జీ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో మాత్రమే లభిస్తుంది. ఇది 72 బీహెచ్ పీ శక్తి, 103 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది కూడా ఎక్స్‌టర్ సీఎన్ జీ కంటే శక్తివంతమైంది. టాటా పంచ్ సీఎన్జీ మైలేజ్ విషయానికి వస్తే మూడింటిలో అతి తక్కువ అందిస్తుంది. దీని ఇంధన సామర్థ్యం 26.9 కేఎం\కేజీగా ఉంది. అంటే ఎక్స్‌టర్ కంటే స్వల్పంగా తక్కువగా అందజేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలను బట్టి పెట్రోల్ వెర్షన్ల మైలేజ్ 19, 20 కేఎమ్పీఎల్ మధ్యలో ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..