PM Kisan Yojana: మీ అకౌంట్‌లో పీఎం కిసాన్‌ నిధి 13వ విడత డబ్బులు పడలేదా.? అయితే ఇలా ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి.

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ ఏటా రూ. 6 వేలు అందిస్తున్నారు. తాజాగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం 13వ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం..

PM Kisan Yojana: మీ అకౌంట్‌లో పీఎం కిసాన్‌ నిధి 13వ విడత డబ్బులు పడలేదా.? అయితే ఇలా ఆన్‌లైన్‌లో ఇలా ఫిర్యాదు చేయండి.
పీఎం కిసాన్ యోజన 13వ విడత నగదు ఫిబ్రవరి 27న రైతుల ఖాతాల్లో జమ అయిన విషయం తెలిసిందే. మొత్తం 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు నగదు ట్రాన్స్‌ఫర్ అయింది. అయితే, లబ్ధిదారుల జాబితాలో ఉన్నా.. కొంతమందికి రూ.2000 జమకాలేదు. దీనికి పలు కారణాలున్నాయి. ఈ రైతుల జాబితాలో మీరు కూడా ఉంటే.. 13వ విడత నగదు పొందే అవకాశం ఉంది.
Follow us

|

Updated on: Mar 02, 2023 | 5:07 PM

రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రతీ ఏటా రూ. 6 వేలు అందిస్తున్నారు. తాజాగా పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం 13వ విడతలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి రూ. 2 వేలు జమ చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 8 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 16,000 కోట్లు జమ చేశారు. అయితే కొందరు రైతుల ఖాతాల్లోకి మాత్రం డబ్బులు జమకాలేవు. మరి డబ్బులు జమ కానీ వారు ఎలా ఫిర్యాదు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పథకం నిధులు అందని వారు ఈమెయిల్‌ లేదా ఫోన్‌ నెంబర్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి డబ్బు జమ కాని వారు pmkisan-ict@gov.in. and pmkisan-funds@gov.in లేదా హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 011-24300606,155261, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1800-115-526కి కాల్‌ చేసి తమ ఫిర్యాదును రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

లబ్ధిదారుల జాబితాను ఇలా చెక్‌ చేసుకోండి..

* ముందుగా పీఎమ్‌ కిసాన్‌ యోజన అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి

* అనంతరం హోమ్‌ పేజీలో ఉండే ‘బెనిఫిషియరీ స్టేటస్‌’పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత ఆధార్‌ కార్డు, అకౌంట్‌ నెంబర్‌ లేదా మొబైల్‌ నెంబర్‌ ఆప్షన్‌ను ఎంచుకొని ఎంటర్‌ చేయాలి.

* చివరిగా ‘గెట్‌ డేటా’పై క్లిక్‌ చేస్తే మీ నిధుల స్టేటస్‌ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..