AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HUL Stock: హిందూస్తాన్‌ యూనిలివర్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా.. కంపెనీ పూర్తి వివరాలు..

HUL గా పిలుచుకునే హిందూస్తాన్‌ యూనిలివర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఆహార(Food) ఉత్పత్తుల నుంచి బాత్‌రూమ్‌(Bathroom)లో వాడే ఉత్పత్తుల వరకు, ప్రతి కుటుంబం HUL తయారు చేసిన ఉత్పత్తిని ఉపయోగిస్తుంది...

HUL Stock: హిందూస్తాన్‌ యూనిలివర్‌లో ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా.. కంపెనీ పూర్తి వివరాలు..
Hul1
Srinivas Chekkilla
|

Updated on: Apr 08, 2022 | 8:19 AM

Share

HUL గా పిలుచుకునే హిందూస్తాన్‌ యూనిలివర్ ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఆహార(Food) ఉత్పత్తుల నుంచి బాత్‌రూమ్‌(Bathroom)లో వాడే ఉత్పత్తుల వరకు, ప్రతి కుటుంబం HUL తయారు చేసిన ఉత్పత్తిని ఉపయోగిస్తుంది. HUL ఉత్పత్తులను ఉపయోగించడంతో పాటు, HUL స్టాక్‌లో పెట్టుబడి పెట్టిన వారు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇటీవల D అంటే మార్చి 11న, HUL షేర్ 52 వారాల కనిష్ఠ స్థాయి 2,096 రూపాయలను తాకింది. ఇంతగా తగ్గినప్పుడు కొంతమంది భయపడతారు, కొందరు దీనిని కొనుగోలు అవకాశంగా చూస్తారు. మొదటగా HUL షేర్ ధరను చూద్దాం. గత ఏడాది సెప్టెంబర్ 21న షేరు 2,859 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

అయితే HUL షేర్ ధర ఇలా ఎందుకు పడిపోతోంది? కంపెనీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న అంశాలను చూద్దాం. మొదటి విషయం ఏమిటంటే HUL దేశంలో అతిపెద్ద FMCG కంపెనీ. కంపెనీ బ్రాండ్లలో 80% కంటే ఎక్కువ.. మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి. ఈ నాయకత్వానికి కారణం ఏమిటి? ఇందులో పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, 50 కంటే ఎక్కువ బ్రాండ్‌లు బలమైన మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ సపోర్ట్ కలిగి ఉన్నాయి. HUL 14 బ్రాండ్‌లు ఒక్కొక్కటి రూ. 1000 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. కంపెనీ ఫ్యాక్టరీలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నందున, ఇది సరుకు రవాణా ఛార్జీలను ఆదా చేయడంలో కూడా సహాయపడుతుంది.

కంపెనీ బలమైన ధరల శక్తిని కలిగి ఉంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరిగినప్పుడు ఉత్పత్తుల ధరను పెంచుతుంది. ఇన్‌పుట్ ఖర్చులు పెరిగినప్పటికీ, ధరల పెరుగుదల, వ్యయాలలో కోత కంపెనీ బలమైన మార్జిన్‌లను కొనసాగించడంలో సహాయపడింది. GSK హెల్త్‌కేర్‌తో విలీనం ఆహార విభాగంలో కూడా బలమైన పునాదిని వేసింది. ముఖ్య విషయం ఏమిటంటే కంపెనీకి అప్పులు ఏమి లేవు. కంపెనీ బ్యూటీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది. ఆ తర్వాత హోమ్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి ఎక్కువ ఆదాయం వస్తుంది. ఇవన్నీ కంపెనీకి అనుకూలమైన పాయింట్లు. ఇక కంపెనీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలను ఏమిటో చూద్దాం.

గత మూడు త్రైమాసికాలుగా కంపెనీ వాల్యూమ్ వృద్ధి క్షీణిస్తోంది. 3వ త్రైమాసికంలో ఓమిక్రాన్, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, విదేశీ పెట్టుబడిదారుల వాటాలో క్షీణత కారణంగా ఈ విభాగం ప్రభావితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో వాల్యూమ్‌లు తగ్గడం పట్ల కంపెనీ ఆందోళన చెందుతోంది. రాబోయే కాలంలో పెరుగుతున్న వస్తువుల ధరలు కంపెనీకి సమస్యలను సృష్టించవచ్చు. విదేశీ ఇన్వెస్టర్ల వాటా తగ్గిపోవడం కంపెనీకి ప్రతికూలంగా మారింది. దీంతోపాటు కంపెనీ గట్టి పోటీని ఎదుర్కొంటోంది. సబ్బుల నుంచి వ్యక్తిగత సంరక్షణ వరకు ఉన్న విభాగాలలో తీవ్రమైన పోటీ ఉంది. వాల్యూమ్ పెరుగుదల గణాంకాలు కూడా అదే ధోరణిని సూచిస్తున్నాయి.

Note: ఇది కంపెనీకి చెందిన సమాచారం మాత్రమే. ఇది కేవలం అవగాహన కోసం. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే నిపుణులను సంప్రదించవచ్చు.

Read Also.. Book Now Pay Later: ఇప్పుడే బుక్‌ చేయండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త సేవలు