AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infosys: తగ్గేదే లే అంటున్న ఇన్ఫోసిస్.. నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ కొనసాగిస్తామని వెల్లడి..

నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ వివాదంపై ఇన్ఫోసిస్‌ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇన్ఫోసిస్‌ కొత్తగా అమల్లోకి తెచ్చిన నాన్‌ కాపింట్‌ అగ్రిమెంట్‌ సరికాదంటూ ఇప్పటికే నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (నాసెంట్‌) కార్మికశాఖను ఆశ్రయించిన సంగతి తెలిసిందే...

Infosys: తగ్గేదే లే అంటున్న ఇన్ఫోసిస్.. నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ కొనసాగిస్తామని వెల్లడి..
Infosys
Srinivas Chekkilla
|

Updated on: Jun 05, 2022 | 8:30 AM

Share

నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ వివాదంపై ఇన్ఫోసిస్‌ వెనక్కి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. ఇన్ఫోసిస్‌ కొత్తగా అమల్లోకి తెచ్చిన నాన్‌ కాపింట్‌ అగ్రిమెంట్‌ సరికాదంటూ ఇప్పటికే నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయిస్‌ సెనేట్‌ (నాసెంట్‌) కార్మికశాఖను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై కార్మిక శాఖకు ఇన్ఫోసిస్‌ తరఫున హెచ్‌ఆర్‌ మేనేజ్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ కే నారాయణ్‌ రాత పూర్వకంగా సమాధానం పంపారు. తమ సంస్థలో రాజీనామా చేసిన ఉద్యోగి పోటీ సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగంలో చేరకూడదనే నిబంధన కొత్తదేమీ కాదని ఇన్ఫోసిస్‌ కార్మిక శాఖకు తెలిపింది. ఈ నిబంధనను ‘కామన్‌ అండ్‌ స్టాండర్డ్‌ బిజినెస్‌ ప్రాక్టీస్‌’గా ఆ సంస్థ వెల్లడించింది. తమ క్లంయింట్లకు సంబంధించిన సున్నిత, రహస్య సమాచారం తెలుసుకున్న ఉద్యోగులు పోటీ కంపెనీలో చేరినప్పుడు విలువైన సమాచారాన్ని ఇతరులకు చేరవేసే ప్రమాదం ఉంటుందని ఇన్ఫోసిస్‌ కార్మిక శాఖ ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో పేర్కొంది.

తమ క్లంయిట్ల శ్రేయస్సు, నాణ్యమైన సేవలు అందివ్వడంలో భాగంగానే నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌ను అమల్లోకి తెచ్చినట్టు ఇన్ఫోసిస్‌ స్పష్టం చేసింది. నాన్‌ కాంపిట్‌ అగ్రిమెంట్‌పై ఇన్ఫోసిస్‌ నుంచి అందిన సమాచారంపై ఇంకా కార్మిఖ శాఖ (పూణే) ఇంతవరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఇన్ఫోసిస్‌ తెలిపిన అభిప్రాయాలు, నాసెంట్‌ ప్రతినిధులు వెలిబుచ్చిన ఆందోళనల పట్ల నిపుణులతో చర్చలు కొనసాగిస్తోంది. ఇటు ఉద్యోగులు అటు కార్పోరేట్‌ ప్రయోజనాలు దెబ్బతినకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే పనిలో కార్మిక శాఖ నిమగ్నమై ఉంది.

Follow Us
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్‌ షాక్..ముంబై పీఎస్‌లో కొత్త కంప్లైంట్
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
ఎంసీఏ చదివి రైతుగా మారి.. 26 ఆవులతో విజయగాథ!
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
బిగ్ బాస్‌ షురూ.. 'గంగూలీ' రాకతో క్రేజ్‌ మరింత ఎత్తుకు..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..
తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. టాప్ 5 సింపుల్ బిజినెస్‌లు ఇవే..