Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Currency Notes: కరెన్సీ నోట్లపై చేతి రాతలు ఉంటే అవి చెల్లవా? RBI నిబంధనలు ఏంటో తెలుసుకోండి..

గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. మీరు ఏదైనా కొత్త కరెన్సీ నోటుపై ఏమైనా రాస్తే, అది చెల్లదని, అది ఇక విలువ లేనిది అయిపోతుందని ఆ మెసేజీలో సారంభం తెగ వైరల్ అవుతోంది.

Currency Notes: కరెన్సీ నోట్లపై చేతి రాతలు ఉంటే అవి చెల్లవా? RBI నిబంధనలు ఏంటో తెలుసుకోండి..
Money
Follow us
Madhavi

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 03, 2023 | 6:30 PM

గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక మెసేజ్ వైరల్ అవుతోంది. మీరు ఏదైనా కొత్త కరెన్సీ నోటుపై ఏమైనా రాస్తే అది చెల్లదని, అది ఇక విలువ లేనిది అయిపోతుందని ఆ మెసేజీలో సారంశం. ఇది వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో  తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఏమని ఉందంటే.. మీరు కరెన్సీ నోట్‌పై ఏదైనా రాస్తే.. అది ఇక చెల్లదు.. మీ నోటుకు ఎలాంటి విలువ ఉండదు.. అది కేవలం చిత్తు కాగితం ముక్కతో సమానం అని మెసేజ్ సర్క్యూలేట్ అవుతోంది. దీంతో చాలా మంది వ్యాపారులు కరెన్సీ నోట్లపై పెన్ను గీతలు, ఇతర మరకలు కనబడగానే కస్టమర్ల నుంచి డబ్బు తీసుకోవడం లేదు. అటు కస్టమర్లు కూడా వ్యాపారుల నుంచి ఈ తరహా నోట్లు తీసుకునేందుకు తిరస్కరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం పెద్ద తలకాయ నొప్పిగా మారింది.

మరోవైపు దేశంలో డిజిటల్ లావాదేవీలు పొందుకుంటున్న నేపథ్యంలో, ఇప్పటికే నోట్ల వాడకం అనేది చాలా తగ్గిపోయింది. అయితే నేటికీ చాలా లావాదేవీలు నోట్ల ద్వారానే జరుగుతున్నాయి. పెద్ద లావాదేవీలు అన్నీ కూడా కరెన్సీ నోట్ల ద్వారానే జరుగుతున్నాయి. ఎందుకంటే డిజిటల్ లావాదేవీలకు పరిమితులు ఉంటాయి. అదే కరెన్సీ లావాదేవి లకు అయితే ఇలాంటి పరిమితులు ఉండవు. డిజిటల్ లావాదేవీలకు ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండాలి. అదే కరెన్సీ లావాదేవీలకు అయితే మీరు ఎప్పుడైనా ఎక్కడైనా లావాదేవీలు జరుపుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం వార్తల వల్ల అటు వ్యాపారులు కస్టమర్లు ఇద్దరు ఆందోళనకు గురవుతున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఈ వ్యవహారంపై అసలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసుకుందాం.

ఇవి కూడా చదవండి

PIB ఫాక్ట్ చెక్ ఇలా చెప్పింది:

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ ను పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విచారించింది. PIB ఫ్యాక్ట్ చెక్ వైరల్ సందేశాన్ని పరిశోధించినప్పుడు, మొత్తం నిజం తెరపైకి వచ్చింది. ఆర్‌బీఐ పేరుతో వైరల్ అవుతున్న మెసేజ్ పూర్తిగా ఫేక్ అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన విచారణలో పేర్కొంది. PIB తన అధికారిక హ్యాండిల్ నుండి పెన్నుతో వ్రాసిన నోట్లు చెల్లవు అనేది అబద్ధమని తేల్చింది. అయితే క్లీన్ నోట్ పాలసీ ప్రకారం, కరెన్సీ నోట్లపై ఏమీ రాయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఎందుకంటే అలా చేయడం వల్ల నోట్లు పాడైపోయి, అవి చిరిగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

పీఐబీ ఫాక్ట్ చెక్ ట్వీట్..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..