NTPC Green Energy IPO: ఆ కంపెనీ షేర్లు కొంటే నష్టమా..? ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు ఇవే..!

స్టాక్ మార్కెట్ లో ఐపీవోకు వచ్చే కంపెనీలపై అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇన్వెస్టర్లు వెయ్యి కళ్లతో వీటి కోసం ఎదురు చూస్తుంటారు. ఆ కంపెనీ చరిత్ర, లాభాలు, షేర్ ప్రైస్ తదిర వాటిపై చర్చలు జరుగుతూ ఉంటాయి. కొత్తగా వచ్చే పెట్టుబడిదారులతో పాటు అనుభవం కలిగిన ఇన్వెస్టర్లు కూడా కొత్త కంపెనీ ట్రేడింగ్ తీరును గమనిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీవోకు కొత్త కంపెనీ రాగానే పండగ వాతావరణం నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ సంస్థ మంగళవారం ఐపీవోకు వచ్చింది. అయితే మొదటి రోజు 36 శాతం సబ్ స్క్రిప్షన్ ను మాత్రమే నమోదైంది. అయితే ఈ కంపెనీ వల్ల కొన్ని నష్టాలు కూాడా కలిగే అవకాశం ఉన్నాయని నిపుణులు తెలిపారు.

NTPC Green Energy IPO: ఆ కంపెనీ షేర్లు కొంటే నష్టమా..? ఇన్వెస్టర్లకు నిపుణుల సూచనలు ఇవే..!
Follow us
Srinu

|

Updated on: Nov 20, 2024 | 4:45 PM

ప్రముఖ ప్రభుత్వ రంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ నార్తర్న్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) నుంచి గ్రీన్ ఎనర్జీ లిమిటెట్ సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)కు వచ్చింది. యాంకర్ ఇన్వెస్టర్లకు నవంబర్ 18 నుంచి అవకాశం కల్పించారు. ఈ ఐపీవో ద్వారా రూ.10 వేల కోట్లు సమీకరించాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తాజాగా 92.59 కోట్ల షేర్లు ఇష్యూ చేస్తోంది. మంగళవారం మొదలైన వేలం ఈ నెల 22వ తేదీతో ముగుస్తుంది. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేర్ కు రూ.102 నుంచి రూ.108 మధ్య నిర్ణయించారు. 138 షేర్లను కనీస అప్లికేషన్ పరిమాణంగా నిర్దారణ చేశారు. అంటే రిటైల్ పెట్టుబడిదారులు రూ.14,904 పెట్టుబడి పెట్టాలి. దీనిపై రిటైల్ పెట్టుబడిదారులు గణనీయమైన ఆసక్తి కనబరిచారు. వారి భాగం 1.46 రెట్లు సబ్ స్క్రైబ్ నమోదైంది. అయితే క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్లు (క్యూఐబీ) కేటగిరీలో నమోదు కాలేదు. నాన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ) విభాగంలో 0.17 రెట్లు మాత్రమే నమోదు అయ్యింది.

ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెట్ కంపెనీ అనేక విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులను చేపడుతోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన సొమ్మును తన అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ లో పెట్టుబడి పెట్టాలని భావిస్తోంది. అలాగే కొన్ని రుణాల చెల్లింపులకు సైతం కేటాయించనుంది. అయితే ఈ కంపెనీ వల్ల ఇన్వెస్టర్లకు కలిగే కొన్ని నష్టాలను విశ్లేషకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి
  • గ్రీన్ ఎనర్జీ కంపెనీ తన మొదటి ఐదుగురు కస్టమర్ల నుంచే ఆదాయంలో ఎక్కువ భాగం పొందుతోంది. వారిలో ఎవరైనా ఒప్పందాలను తగ్గించినా, రద్దు చేసుకున్నా నష్టాలు కలగవచ్చు.
  • సంస్థకు చెందిన అనేక పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు రాజస్థాన్ లో ఉన్నాయి. స్థానికంగా ఉన్న కొన్ని ఇబ్బందులు కారణంగా నష్టాలకు గురికావచ్చు.
  • అధిక రిస్క్ నకు సిద్ధపడిన పెట్టుబడిదారులతో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలు ఉన్నవారికి మాత్రమే ఈ ఐపీవో సరిపోతుంది.
  • అన్ని స్టాక్ బ్రోకరేజ్ సంస్థలూ ఈ ఐపీవోపై స్పందించాయి. దీర్ఘకాలిక రాబడిని కొరుకునేవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుందని చెప్పాయి.
  • ఐపీవోకు ముందు గ్రేమార్కెట్ ప్రీమియం (జీఎంపీ) క్షీణతను చూస్తోంది. ఒక్కో షేర్ కు రూ.1 మాత్రమే ఉంది. ప్రస్తుతం రూ.0.80 పైసలుకు పడిపోయింది. జీఎంపీ అనేది పబ్లిక్ ఇష్యూ కోసం ఎక్కువ చెల్లించేందుకు పెట్టుబడిదారుల సముఖతను తెలియజేస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి