IRCTC: ఐఆర్‌సీటీసీ అదరిపోయే ఆరు రోజుల టూర్‌ ప్యాకేజీ.. ఈ అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు

|

Apr 06, 2021 | 7:48 AM

IRCTC Tour Package: ఇండియన్‌ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ తాజాగా అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఎండా కాలంలో వేడి నుంచి తప్పించుకుని క వారం రోజుల..

IRCTC: ఐఆర్‌సీటీసీ అదరిపోయే ఆరు రోజుల టూర్‌ ప్యాకేజీ.. ఈ అందమైన ప్రదేశాలను తిలకించవచ్చు
Irctc Tour Package
Follow us on

IRCTC Tour Package: ఇండియన్‌ రైల్వేకు చెందిన ఐఆర్‌సీటీసీ తాజాగా అదిరిపోయే టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఎండా కాలంలో వేడి నుంచి తప్పించుకుని క వారం రోజుల పాటు సుందరమైన ప్రదేశాలను చుట్టేసి రావాలనుకునేవారికి ఈ టూర్‌ అనువుగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, అందమైన ప్రదేశాలను చూడాలనుకునేవారికి ఈ టూర్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఐఆర్‌సీటీసీ మేఘాలయ అండ్‌ అసోం పేరుతో ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది.మీరు ఈ టూర్‌లో భాగంగా షిల్లాంగ్, చిరపుంజీ, కాజీరంగ, గువాహటి వంటి ప్రాంతాలను తిలకించవచ్చు. ఈ టూర్‌ మే 1న ప్రారంభం అవుతుంది. ఈ టూర్‌ కూడా హైదరాబాద్‌ నుంచి ప్రారంభం అవుతుంది.

మే 1న హైదరాబాద్ నుంచి గువాహటికి విమానం ఉంటుంది. అలాగే మే 6న గువాహటి నుంచి మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి రానుంది. అంటే మీరు ఈ మధ్య కాలంలో పైన పేర్కొన్న అన్ని ప్రదేశాలు చుట్టేస్తారు. ఈ టూర్ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.31,600గా ఉంది. సింగిల్ ఆక్యుపెన్సీ అయితే రూ.39,700, డబుల్ ఆక్యుపెన్సీ అయితే రూ.33,350 అవుతుంది. ఫ్లైట్ టికెట్ ధరలు సహా బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఐఆర్‌సీటీసీనే అందిస్తుంది. కాగా, ఇప్పటికే ఇలాంటి టూర్‌ ప్యాకేజీలను సైతం అందించింది. పర్యాటకులను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ధరల్లో, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందమైన ప్రదేశాలను చూపించేందుకు ఈ ప్యాకేజీలను అందిస్తోంది.

ఇవీ చదవండి: Golden Pan: ఒక్క కిళ్లీ ధర రూ. 600.. ఏమైనా బంగారంతో చేస్తారంటారా.? అవును నిజమే..

నిల్వ ఉంటాయని.. వీటిని ఫ్రిడ్జి లో పెడుతున్నారా… అవి విషం కంటే ప్రమాదమట..అవేంటో తెలుసుకోండి..!