Women’s Day 2022: స్టాక్ మార్కెట్‌లో మహిళలు రాణిస్తూ.. ఆదాయం పెంచుకోవడానికి 5 సూపర్బ్ ఐడియాస్.. మీకోసం

|

Mar 07, 2022 | 1:04 PM

Women's Day 2022: వందేళ్లకు పైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఆకాశంలో సగం, అవకాశంలో సగం.. అన్నిట్లోనూ సగం అంటూ మహిళలు.. తమ హక్కుల కోసం..

Womens Day 2022: స్టాక్ మార్కెట్‌లో మహిళలు రాణిస్తూ.. ఆదాయం పెంచుకోవడానికి 5 సూపర్బ్ ఐడియాస్.. మీకోసం
International Women's Day 2
Follow us on

Women’s Day 2022: వందేళ్లకు పైగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ప్రపంచ దేశాలు ఘనంగా జరుపుకుంటున్నాయి. ఆకాశంలో సగం, అవకాశంలో సగం.. అన్నిట్లోనూ సగం అంటూ మహిళలు.. తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు. తమని తాము అన్ని రంగంలో నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ  నేపథ్యంలో ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు పెట్టుబడిదారులుగా మారి.. తమ సంపదను పెంచుకోవడానికి  మార్గాల గురించి తెలుసుకుందాం.. స్టాక్ మార్కెట్(Stock Market)లో పెట్టుబడి పెట్టి ధనవంతులు కావడానికి ఐదు సూపర్బ్ ఐడియాస్(Golden Rules)ను ట్రేడ్‌స్మార్ట్ సీఈఓ వికాస్ సింఘానియా చెప్పారు. అవి మీకోసం..

స్టాక్ మార్కెట్ల రంగంలో అడుగుతూ పెట్టిన వారిలో కేవలం 5 శాతం కంటే తక్కువ మంది మాత్రమే నికర లాభాలను ఆర్జిస్తున్నారని చెప్పారు. జీరో సమ్ గేమ్‌లో..  కొద్దిమంది పెట్టుబడిదారులకే సంపద సొంతమవుతుంది. ఈ వ్యక్తులను మిగిలిన వారి నుండి వేరు చేసేది.. వీరి తెలివితేటలతో పాటు.. క్రమశిక్షణ, ఆచరణాత్మక విధానం. ఈ లక్షణాలే మహిళలను పెట్టుబడిదారులుగా మారుస్తాయి. తమకు నచ్చిన రంగంలో పెట్టుబడి పెట్టేలా చేస్తాయి.

నిజానికి మగవారి కంటే మహిళలకె పెట్టుబడిదారులుగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఎందుకంటే స్టీలు సహజంగానే  పొదుపు చేయడంలో దిట్ట. అంతేకాదు ధర , విలువ మధ్య మంచి తేడాను గుర్తించగలరు. అయితే, స్టాక్ మార్కెట్‌లో సంపదను పెంచుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు మహిళలు ధనవంతులు కావడంలో  సహాయపడతాయి.

  1. ఎంట్రీ రూల్స్: స్టాక్‌ మార్కెట్ లో కొనుగోళ్లు చేయడానికి కూడా కొన్ని నియమాలున్నాయి. వస్తువులను ఎలా నాణ్యత, ధర గురించి ఎంపిక చేసి వస్తువులు కొనుగోలు చేస్తామో.. అదే రూల్స్ స్టాక్ మార్కెట్ కూడా వర్తిస్తాయి. స్టాక్‌లను ఎంచుకునేటప్పుడు అదే లాజిక్ పనిచేస్తుంది. షేర్ కొనే విషయంలో అమ్మే విషయంలో హడావిడి పడకుండా అలోచించి అడుగులు వేయాలి.
  2. నాణ్యతను చూసి ఎంచుకోండి: నాణ్యమైన స్టాక్‌లను కొనడం అంటే .. మంచి నిర్వహణ యాజమాన్యం ఉన్న సంస్థలను ఎంచుకోవడంతో పాటు.. ఆటుపోట్లు తట్టుకునే సంస్థ యాజమాన్యం ఉన్న కంపెనీల షేర్స్ ను కొనుగోలు చేయడం ఉత్తమం
  3. మీరు మీ పిల్లలకు వివరించగల వ్యాపారంలో పెట్టుబడి పెట్టండి: లెజెండరీ ఇన్వెస్టర్ పీటర్ లించ్ పెట్టుబడి హేతుబద్ధతను ఒకే వ్యాఖ్యల్లో చెప్పగల తెలివి తేటలు కలిగి ఉన్నాడు. అతను ఏడవ తరగతి చదువుతున్న సమయంలోనే పెట్టుబడి గురించి నేర్చుకున్నాడు. కంపెనీలలో పెట్టుబడి పెట్టడం అంటే వ్యాపారంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు దాన్ని సులభంగా అర్థంచేసుకోవడం .. ఎలా సరిదిద్దవచ్చో అర్థం చేసుకోవడం. నష్టం తక్కువగా ఉన్నప్పుడు, ధర తగ్గినప్పుడు మరిన్ని షేర్లను కొనుగోలు చేయడం.. లేదా కంపెనీ కోలుకోవడానికి సమయం తీసుకుంటే వెంటనే వాటిని అమ్మేయడం వంటి విషయాలపై సరైన సమయంలో సరైన తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది.
  4. వైవిధ్యం: ఒకటి కంటే ఎక్కువ స్టాక్‌లలో పెట్టుబడి పెట్టండి. అది కూడా వివిధ రంగాల్లోనూ పెట్టుబడి పెట్టడం ఉత్తమం. వ్యాపార సంస్థలు వివిధ రంగాలలో విభిన్నంగా ఉన్నందున.. వైవిధ్య రంగంలో పెట్టుబడి పెట్టడంతో .. అందులో ఏ ఒక్కటైనా ఆర్ధిక పతనాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  5. పర్యవేక్షణ: పెట్టుబడిని గుడ్లను పొదిగే తల్లి కోడిలా పర్యవేక్షించాలి. పెట్టుబడి విషయంలో శ్రద్ద అవసరం. ముఖ్యంగా కంపెనీలు ఎలా వృద్ధి చెందుతున్నాయో ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం చాలా అవసరం.

Also Read:

 ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందుకునే అవకాశం.. డోంట్ మిస్‌ ఇట్‌!

 ఫైనాపిల్‌ను ప్రాసెస్ చేస్తూ.. తమ పంటను అదనపు ఆదాయంగా మార్చుకుంటున్న రైతులు.. ఎక్కడంటే