FD Interest Rates: ఆ బ్యాంకుల్లో ఎఫ్‌డీలపై వడ్డీల జాతర.. మూడు బ్యాంకుల్లో అత్యధిక వడ్డీ రేట్లు
ముఖ్యంగా రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు బ్యాంకులు ఇస్తున్నాయి. భారతదేశంలో ప్రముఖ బ్యాంకులు అయిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు వడ్డీ రేట్లు గణనీయంగా పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్‌డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.60 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది.

డబ్బు లేనిదే ఈ సమాజంలో ఎవరికీ విలువ ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ సంపాదించిన సొమ్ములో కొంత మేర పొదుపు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు. అయితే మనం కష్టపడి సంపాదించిన సొమ్ముకు మంచి రాబడి కోసం వివిధ పెట్టుబడి పథకాలను ఆశ్రయిస్తూ ఉంటాం. 2022 నుంచి ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలతో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా రూ.2 కోట్ల కంటే తక్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లు బ్యాంకులు ఇస్తున్నాయి. భారతదేశంలో ప్రముఖ బ్యాంకులు అయిన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకులు వడ్డీ రేట్లు గణనీయంగా పెంచాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డిపాజిట్ కాలపరిమితి, డిపాజిటర్ వయస్సు ఆధారంగా ఎఫ్‌డీపై 7.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఏటా 7.60 శాతం వరకు ఎఫ్‌డీ రేట్లను అందిస్తోంది. ఎస్‌బీఐ సంవత్సరానికి 7.50 శాతం వరకు ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకుల ఎంత మేర వడ్డీ రేట్లను అందిస్తున్నాయో? ఓ సారి తెలుసుకుందాం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
- 7 రోజుల నుంచి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
- 46 రోజుల నుంచి ఆరు నెలల వరకు సాధారణ ప్రజలకు – 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
- 6 నెలల 1 రోజు నుంచి 9 నెలల కంటే తక్కువ సమయానికి సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 9 నెలల 1 రోజు నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు 6.60 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.10 శాతం
- 15 నెలల నుంచి రెండు సంవత్సరాల కంటే తక్కువ: సాధారణ ప్రజలకు – 7.10 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 2 సంవత్సరాల 11 నెలల నుంచి 35 నెలల వరకు సాధారణ ప్రజలకు – 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.65 శాతం
- 2 సంవత్సరాల 11 నెలల 1 రోజు నుంచి సమానం లేదా 4 సంవత్సరాల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 4 సంవత్సరాల 7 నెలల నుంచి 55 నెలల వరకు సాధారణ ప్రజలకు 7.20 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.70 శాతం
- 4 సంవత్సరాల 7 నెలలు 1 రోజు నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ లేదా సమానం: సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.75 శాతం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- 7 రోజుల నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు – 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
- 46 రోజుల నుంచి 179 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
- 180 రోజుల నుంచి 210 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 211 రోజుల నుంచి 1 సంవత్సరం కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.00 శాతం; సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.80 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.30 శాతం
- 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కంటే తక్కువ సాధారణ ప్రజలకు 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
- 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కంటే తక్కువ సాధారణ ప్రజలకు – 6.50 శాతం; సీనియర్ సిటిజన్లకు – 7.00 శాతం
- 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం.
ఐసీఐసీఐ బ్యాంక్
- 7 రోజుల నుండి 29 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 3.50 శాతం
- 30 రోజుల నుంచి 45 రోజుల వరకు సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.00 శాతం
- 46 రోజుల నుంచి 60 రోజుల వరకు సాధారణ ప్రజలకు – 4.25 శాతం, సీనియర్ సిటిజన్లకు – 4.75 శాతం
- 61 రోజుల నుంచి 90 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.50 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.00 శాతం
- 91 రోజుల నుంచి 184 రోజుల వరకు సాధారణ ప్రజలకు 4.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 5.25 శాతం
- 185 రోజుల నుంచి 270 రోజుల వరకు సాధారణ ప్రజలకు 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.25 శాతం
- 271 రోజుల నుంచి 1 సంవత్సరం వరకు సాధారణ ప్రజలకు 6.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 6.50 శాతం
- 1 సంవత్సరం నుంచి 15 నెలల కంటే తక్కువ సాధారణ ప్రజలకు 6.70 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.20 శాతం
- 15 నెలల నుంచి 2 సంవత్సరాల వరకూ సాధారణ ప్రజలకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.60 శాతం
- 2 సంవత్సరాల 1 రోజు నుంచి 5 సంవత్సరాల వరకు సాధారణ ప్రజలకు – 7.00 శాతం, సీనియర్ సిటిజన్లకు – 7.50 శాతం
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి