Vehicle Insurance: వరదల్లో వాహనాలు బాగా దెబ్బతిన్నాయా? ఇన్స్యూరెన్స్‌ కోసం అప్లై చేసేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

|

Sep 10, 2022 | 10:49 AM

Bangalore Floods: వరదల్లో వాహనాలు డ్యామేజ్ అయితే.. ఇన్స్యూరెన్స్ కంపెనీలు సాయం చేస్తాయి. గతంలో వాహనాల బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) పలు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Vehicle Insurance: వరదల్లో వాహనాలు బాగా దెబ్బతిన్నాయా? ఇన్స్యూరెన్స్‌ కోసం అప్లై చేసేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే
Bangalore Floods
Follow us on

Bangalore Floods: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో బెంగళూరు నగరం అతలాకుతలమైంది. గత శతాబ్ధకాంలో ఎన్నడూ లేనంతగా వర్షాలు సిలికాన్‌ సిటీని ముంచెత్తాయి. రోడ్లపై ఉప్పొంగిన వరద నీటితో అక్కడి ప్రజలు తెగ ఇబ్బంది పడ్డారు. చాలాచోట్ల కార్లు, బైకులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరికొన్ని వర్షపు నీటికి బాగా దెబ్బతిన్నాయి. అయితే వరదల్లో వాహనాలు డ్యామేజ్ అయితే.. ఇన్స్యూరెన్స్ కంపెనీలు సాయం చేస్తాయి. గతంలో వాహనాల బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDA) పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రకృతి వైపరీత్యాల కారణంతో వాహనాలు దెబ్బతింటే ఇన్స్యూరెన్స్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్ ప్రక్రియను సరళతరం చేయాలని బీమా కంపెనీలను ఐఆర్‌డీఏ సూచించింది. అయితే చాలామంది వరదల్లో పాడైపోయిన వాహనాలను బలవంతంగా స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాడైపోయిన ఇంజిన్లను బలవంతంగా స్టార్ట్‌ చేస్తే బీమా కంపెనీలు దీనిని వాహనదారుడి నిర్లక్ష్యంగా పరిగణిస్తున్నాయి. ఈనేపథ్యంలో వారి ఇన్స్యూరెన్స్‌ క్లెయిమ్‌లను కూడా నిర్ధాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నాయి.

అలా చేసి బాగా దెబ్బతిన్నారు..
కాగా ఇప్పుడు బెంగళూరును ముంచెత్తినట్టే 2015లో చెన్నై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తాయి. బైకులు, కార్లు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఈనేపథ్యంలో కొందరు వాహన బీమా కోసం ప్రయత్నించగా ఇన్స్యూరెన్స్ కంపెనీలు రిజెక్ట్‌ చేశాయి. దీనిక ప్రధాన కారణం వర్షంతో పాడైపోయిన ఇంజిన్లను బలవంతంగా స్టార్ట్‌ చేయడమే. కాగా ఇంజిన్‌ బాగు చేయడం లేదా రీప్లేస్‌ చేయడమన్నది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. దీంతో చెన్నై వామనదారులు తమ ఇంజిన్లను బాగు చేయించుకోవడం లేదా రీప్లేస్‌ చేసుకోవడానికి తమ సొంత జేబుల నుంచే డబ్బులు తీయాల్సి వచ్చింది. ఇదే సమయంలో చెన్నైలోని ఏషియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజంకు చెందిన ప్రొఫెసర్ కెఎన్ అరుణ్, తన రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని పార్కింగ్ స్థలంలో వరద నీటిలో పూర్తిగా మునిగిపోయిన తన రెండు వాహనాలకు బీమా క్లెయిమ్‌ చేశాడు. కేవలం 15 రోజుల్లోనే బీమా డబ్బులు పొందాడు. దీనికి కారణం ఇన్స్యూరెన్స్‌లో ఫైన్‌ ప్రింట్‌ వివరాలపై ఆయనకు చాలా బాగా అవగాహన ఉండడమే. ఈనేపథ్యంలో వాహనాల బీమాకు సంబంధించి వాహన యజమానులకు పలు కీలక సూచనలిచ్చారు ప్రొఫెసర్‌ అరుణ్‌.

భారీగా బీమా క్లెయిమ్‌ల తిరస్కరణ..

ఇవి కూడా చదవండి

‘వరదల సమయంలోనే కాదు, నీళ్లతో నిండిన రోడ్లపై వాహనాలు నిలిచిపోతే స్టార్ట్‌ చేయడానికి అసలు ప్రయత్నించకూడదు. ఇలాంటి సమయాల్లో వెంటనే సర్వీస్‌ సెంటర్లకు ఫోన్‌ చేసి తగిన సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇక వాహనాలు వరదల్లో మునిగిపోయి ఇంజిన్‌ పాడై పోయినప్పుడు వెంటనే బీమా కంపెనీకి సమాచారం అందజేయాలి. వారికి తగిన వివరాలివ్వాలి. బీమా కంపెనీలు ప్రతిస్పందించడం లేదనో, ముఖ్యమైన పనులున్నాయనో బలవంతంగా ఇంజిన్‌ను స్టార్ట్‌ చేస్తే మాత్రం చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ఇక్కడ చాలామందికి ఒక డౌట్‌ రావొచ్చు. మనం బలవంతంగా ఇంజిన్‌ను స్టార్ట్‌ చేశామనే విషయం బీమా కంపెనీలకు ఎలా తెలుస్తుంది? అని. ఈ విషయమై బీమా కంపెనీలు అనుభవమున్న మెకానిక్‌లతో వాహనాలను పరిశీలన చేయిస్తారు. ఒకవేళ మనం బలవంతంగా ఇంజిన్‌ను స్టార్ట్‌ చేయడానికి ప్రయత్నించి ఉంటే పిస్టన్‌లపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ విషయాన్ని మెకానిక్‌లు సులభంగా పసిగడతారు. ఈ కారణంతోనే 2015 చెన్నై వరదల్లో పాడైపోయిన వాహనాల బీమా క్లెయిమ్‌లు భారీగా తిరస్కరణకు గురయ్యాయి, ఈనేపథ్యంలో బెంగళూరులోని వాహన యజమానులకు నేనిచ్చే ఉత్తమ సలహా ఏమిటంటే.. వరద నీరు తగ్గిన తర్వాత మీ వాహనాలను స్టార్ట్ చేయడానికి అసలు ప్రయత్నించకండి. దీనికి బదులుగా సర్వీస్ స్టేషన్‌ల నుండి వృత్తిపరమైన సహాయం పొందండి. వారి సలహాలు, సూచనలు తప్పకుండా ఫాలో అవ్వండి’ అని ఫ్రొఫెసర్‌ చెప్పుకొచ్చాడు.

యాడ్ ఆన్ కవర్‌తో బీమా ..
ఇదే విషయమై Policybazaar.com మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్స్ హెడ్ అశ్విని దూబే మాట్లాడుతూ.. ‘వాహనం ఇంజిన్‌లో నీరు చేరడం వల్ల లేదా నీరు నిలిచిపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి . ఇటువంటి పరిస్థితులలో, హైడ్రోస్టాటిక్ లాక్ అని కూడా పిలువబడే నీటి సీపేజ్ కారణంగా దెబ్బతిన్న ఇంజిన్‌ను రిపేర్ చేయడానికి ఒక ప్రామాణిక మోటారు బీమా పాలసీ తరచుగా ఖర్చులను చెల్లించడానికి నిరాకరిస్తుంది. ఇక ఇంజిన్ ప్రొటెక్షన్ కోసం కారు కొనుగోలుదారులు సెపరేట్‌గా యాడ్ ఆన్ కవర్‌ను తీసుకోవచ్చు. దీని వల్ల వరదలు లేదా తుఫానుల వల్ల మీ కారు పాడైతే.. ఇంజిన్‌కి కూడా బీమా కవరేజ్ వస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్య విషయమేమిటంటే.. బీమా కంపెనీలు ప్రతిస్పందించేవరకు ఇంజిన్లను స్టార్ట్‌ చేయకపోవడమే మంచిది’ అని చెప్పుకొచ్చారు. (Source)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..