Personal Loan: పర్సనల్ లోన్‌కు బదులు ఈ లోన్స్ తీసుకోండి.. వడ్డీ భారం భారీగా తగ్గుతుంది.
బ్యాంకులు సైతం ఇంట్లోనే ఉంటూ మొబైల్ యాప్స్‌లోనే లోన్ పొందొచ్చు. అయితే సాధారణంగా ఎలాంటి డాక్యుమెంట్స్, సెక్యురిటీ లేకుండా ఇస్తారు కాబట్టి పర్సనల్ లోన్స్‌కి వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో తీసుకున్న రణానికి ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. అయితే అధిక వడ్డీ రేటుకు లభించే పర్సనల్ లోన్స్ కాకుండా, తక్కువ వడ్డీకి లోన్స్ పొందే అవకాశం లేదా.? అంటే అది కూడా ఉంది...

ప్రతీ ఒక్కరికీ జీవితంలో రుణం అవసరపడుతుంది. ఆరోగ్యం కోసమో, శుభకార్యక్రమాల కోసం మరే ఇతర వ్యక్తిగత అవసరాల కోసమో రుణాలు తీసుకుంటుంటారు. అయితే సాధారణంగా లోన్ అనగానే వెంటనే పర్సనల్ లోన్ వైపే మొగ్గు చూపుతారు. ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండా సింపుల్‌గా ఇంట్లో కూర్చునే పర్సనల్ లోన్ పొందే అవకాశం కల్పించారు.
బ్యాంకులు సైతం ఇంట్లోనే ఉంటూ మొబైల్ యాప్స్‌లోనే లోన్ పొందొచ్చు. అయితే సాధారణంగా ఎలాంటి డాక్యుమెంట్స్, సెక్యురిటీ లేకుండా ఇస్తారు కాబట్టి పర్సనల్ లోన్స్‌కి వడ్డీ రేట్లు అధికంగా ఉంటాయి. దీంతో తీసుకున్న రణానికి ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. అయితే అధిక వడ్డీ రేటుకు లభించే పర్సనల్ లోన్స్ కాకుండా, తక్కువ వడ్డీకి లోన్స్ పొందే అవకాశం లేదా.? అంటే అది కూడా ఉంది. అలాంటి కొన్ని మార్గాలపై ఓ లుక్కేయండి..
* మీరు ఒకవేళ ఉద్యోగం చేస్తుంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై రుణం తీసుకొవచ్చు. మీ పీపీఎఫ్‌లో ఉన్న డబ్బుపై రుణం పొందొచ్చు. ఇందుకోసం మీరు పీపీఎఫ్ ఖాతా కనీసం ఏడాది ఉండాలి. మీ పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం ఆధారంగా లోన్ అమౌంట్‌ను పొందొచ్చు. పీపీఎఫ్ అకౌంట్‌లో మీకు 7.1 శాతం వడ్డీ అందిస్తున్నారు. అయితే పీపీఎఫ్‌పై రుణం తీసుకుంటే మీరు 8.1 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్‌తో పోల్చితే ఇది తక్కువ అని చెప్పాలి.
* ఇక తక్కువ వడ్డీకి రుణం పొందే మరో అవకాశం గోల్డ్ లోన్‌తో పొందొచ్చు. ఇంట్లో బంగారం ఉంటే మొదటి ఆప్షన్ గోల్డ్ లోన్‌కే ఇవ్వాలి. ఎందుకంటే గోల్డ్‌పై తక్కువ వడ్డీకే రుణం పొందొచ్చు. గోల్డ్ లోన్‌పై రూ. 3 లక్షల రుణం వరకు ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ లోన్‌పై 8.70 శాతానికి రుణం అందిస్తున్నారు.
* ఒకవేళ మీకు ఏదైనా బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్స్ ఉంటే.. దానిపై లోన్ తీసుకోవడం ఉత్తమం. ఎఫ్‌డీపై రుణాలు తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ మొత్తంలో సుమారు 90 నుంచి 95 శాతం రుణం పొందొచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రుణాలు సులభంగా పొందొచ్చు. ఈ లోన్ తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..