
భారతదేశంలో మెరుగైన సేవలను అందించడంతో పాటు 16 ఏళ్లలోపు వారికి మరింత సురక్షితమైన, వయస్సుకు తగిన ఆన్‌లైన్ అనుభవాన్ని అందించడానికి ఇన్‌స్టా గ్రామ్‌లో టీనేజ్ అకౌంట్స్ ప్రారంభిస్తున్నట్లు మెటా ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కొత్త ఫీచర్ కేవలం తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఇన్‌స్టా గ్రామ్ వాడేలా ప్రత్యేక భద్రతా చర్యలతో వస్తుందని పేర్కొంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ టీన్ ఖాతాలు టీనేజర్లు ఆన్‌లైన్‌లో ఎవరితో సంభాషిస్తారో? వారు ఏ రకమైన కంటెంట్‌ను వినియోగిస్తారు? ఎంత సమయం గడుపుతారు? వంటి కీలక సమస్యలను పరిష్కరిస్తాయని మెటా ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ రక్షణ చర్యలు డిఫాల్ట్‌గా ఆటోమెటిక్‌గా ప్రారంభం అవుతాయి. అలాగే తల్లిదండ్రుల అనుమతి లేకుండా వీటిని మార్చే అవకాశం ఉండదు.
ఇన్‌స్టాగ్రామ్ టీన్ ఖాతాలు డిఫాల్ట్‌గా ప్రైవేట్‌గా సెట్ అవుతాయంటే టీనేజర్లు తమ ఫాలోవర్స్‌ను మాన్యువల్‌గా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నియమం 18 ఏళ్లలోపు వారికి కూడా వర్తిస్తుంది. అంతేకాకుండా ఫాలోవర్లు కానివారికి టీనేజర్ల ఖాతాలు కనిపించవు. కాబట్టి వారితో కనెక్ట్ అయిన వ్యక్తులు మాత్రమే వారికి సందేశాలు పంపగలరు. ఈ రక్షణ చర్యలతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్లను వారు ఫాలో వ్యక్తులు మాత్రమే ట్యాగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. అలాగే కామెంట్స్, డీఎంలలో కూడా అభ్యంతరకరమైన భాషను కూడా ఫిల్టర్ చేస్తుంది.
ముఖ్యంగా టీనేజ్ యూజర్లు ఎక్కువ సేపు ఇన్‌స్టాను వాడకుండా నిరోధించడానికి ప్రతి గంటకు యాప్ క్లోజ్ అయిపోతూ ఉంటుంది. అలాగు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్ మోడ్‌ను ఆన్‌చేయమని సూచించేలా నోటిఫికేషన్లను కూడా పంపుతుంది. 16 ఏళ్లు పైబడిన టీనేజర్ల కోసం తల్లిదండ్రులు త్వరలో పర్యవేక్షణలోనే ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉందని మెటా ప్రకటించింది. ముఖ్యంగా రీసెంట్ మెసేజ్‌లను పర్యవేక్షించే సామర్థ్యం, రోజువారీ సమయ పరిమితులను నిర్ణయించడం, అలాగే నిర్దిష్ట గంటల్లో యాప్‌ను బ్లాక్ చేయడం వంటి ఫీచర్లు తల్లిదండ్రులు స్వయంగా యాక్టివేట్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి