AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yellow Chili: పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటిని దేనికి వాడుతారు.. ఎందుకంత డిమాండ్!

అంతర్జాతీయ మార్కెట్లో మన మిర్చి ఘాటుకు ఫుల్ డిమాండ్ పెరిగింది. గత ఏడాది ధరలు లేక దిగులతో పట్టుకున్న రైతులు ఈసారి రికార్డులు సృష్టిస్తున్న ధరలు చూసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పసిడితో పోటీ పడుతున్నాయి. అసలు పచ్చ మిర్చికి ఎందుకంత డిమాండ్. ఆ మిర్చిని ఎక్కడికి ఎగుమతి చేస్తారో తెలుసుకుందాం పదండి.

Yellow Chili: పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటిని దేనికి వాడుతారు.. ఎందుకంత డిమాండ్!
Yellow Chili Prices
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Jan 21, 2026 | 1:25 PM

Share

వరంగల్‌లోని ఎనుమామల వ్యవసాయ మార్కెట్ యార్డుకు మిర్చి అమ్మకానికి పోటెత్తుతుంది. ఎర్ర బంగారం బస్తాల మధ్య అక్కడక్కడ పచ్చ మిర్చి ధగధగ మెరిసి పోతుంది. పచ్చ మిర్చి ధరలు కూడా తళుక్కుమంటున్నాయి.. ప్రస్తుతం ఎర్ర బంగారానికి ఆరంభంలో మార్కెట్ ధరలు ఆహా ఓహో అనిపిస్తున్నాయి. పూర్తిగా మిర్చి చేతికి వచ్చిన తర్వాత ధరలు మురిపిస్తాయో.. రైతులకు కన్నీళ్లు కురిపిస్తాయో ఏమో కానీ ఇప్పుడు మాత్రం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం వరంగల్ ఎనుమాముల మార్కెట్ యార్డులో వండర్ హార్ట్ రకం మిర్చి క్వింటా రూ. 26,200/-, తేజా క్వింటా రూ.22,000, దీపికా రకం మిర్చి క్వింటాకు రూ 26,200, US 341రకం మిర్చి క్వింటాకు 25,500 రూపాయలు ధర పలుకుతుంది. ముఖ్యంగా ఎల్లో మిర్చి ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం క్వింటా ఎల్లో మిర్చి రూ.44,000 రూపాయలు పలుకుతుంది. 20వ తేదీ మంగళవారం క్వింటా ఎల్లోమిర్చి 42,500 తెలపలికింది. ఈరోజు అదే ఎల్లో మిర్చి క్వింటా 44వేల రూపాయల రికార్డు ధర నమోదు కావడంతో రైతుల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎల్లోమిర్చికి ఇలా రికార్డు ధరలు రావడం ఇదే ప్రథమం. అంతర్జాతీయ మార్కెట్లో ఎల్లోమిర్చికి ఎక్కువగా డిమాండ్ ఉండడం వల్లే ఇలా ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. ఈ మిర్చిని చైనా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఎల్లో రంగు మిర్చిని ఎక్కువగా పెప్పర్ ఐటమ్ గా ఉపయోగిస్తుంటారు. కలర్స్ తయారీ, మెడిసిన్, కాస్మోటిక్ తయారి, చిప్స్ పైన పెప్పర్ గా ఉపయోగిస్తుంటారు.

అయితే సాధారణ మిర్చితో పోల్చితే ఎల్లో మిర్చి పంట దిగుబడి కొంత తక్కువగా వస్తుంది కాబట్టి సాగు విస్తీర్ణం కూడా చాలా తక్కువగా ఉంటుంది.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ఎకరాల మేర ఈ మిర్చి సాగు జరుగుతుంది.. ఎల్లో మిర్చికి ఎందుకంత డిమాండ్.. ఈ మిర్చికి రికార్డు స్థాయి ధరలు చెల్లిస్తున్న వ్యాపారులు అంటున్నారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా మిర్చి సాగు విస్తీర్ణం తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మన దగ్గర సాగుచేసే మిర్చికి ప్రస్తుతం డిమాండ్ పెరగడం వల్ల ధరలకు రెక్కలొచ్చాయని మార్కెట్ యార్డ్ అధికారులు అంటున్నారు.ఈ ధరలు మరింత పెరగవచ్చు అంటున్న ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉన్నతశ్రేణి కార్యదర్శి మల్లేష్ అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
పసిడితో పోటీ పడుతున్న పచ్చ మిర్చి.. వీటికి ఎందుకంత డిమాండ్!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
వక్కలకు ఇంతుందా..? సరిగా వాడితే ఈ సమస్యలన్నీ పరార్‌!
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి