మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై బిగ్ అప్డేట్..! వీడియో రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి
భారతదేశ మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ (ముంబై-అహ్మదాబాద్) నిర్మాణంలో కీలక మైలురాయిని చేరుకుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ (OHE) మాస్ట్‌ల ఏర్పాటు వేగంగా జరుగుతోందని ప్రకటించారు. 'మేక్ ఇన్ ఇండియా' చొరవతో ఈ హై-స్పీడ్ రైలు వ్యవస్థ అభివృద్ధి అవుతోందని అన్నారు.

ఇప్పటికే వందే భారత్, వందే భారత్ స్లీపర్ రైళ్లతో ఇండియన్ రైల్వేస్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ క్రమంలోనే ఎంతో ప్రతిష్టాత్మక బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌పై రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబై – అహ్మదాబాద్ మధ్య చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ (OHE) మాస్ట్‌ల ఏర్పాటు స్థిరమైన పురోగతి సాధిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ అభివృద్ధి భారతదేశపు మొట్టమొదటి హై-స్పీడ్ రైలు వ్యవస్థకు విద్యుత్ ట్రాక్షన్‌ను ప్రారంభించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా అభివర్ణించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవ కింద స్థిరమైన ఆన్-గ్రౌండ్ అమలును ప్రతిబింబిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైన హై-స్పీడ్ రైలు సాంకేతికతను అవలంబిస్తూ దేశీయ తయారీ సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. సురక్షితమైన, మృదువైన, సమర్థవంతమైన హై-స్పీడ్ రైలు కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి వయాడక్ట్ స్ట్రెచ్‌లతో సహా అలైన్‌మెంట్‌లోని కీలక విభాగాలలో OHE మాస్ట్‌ల సంస్థాపన జరుగుతోందని వైష్ణవ్ పేర్కొన్నారు. అలాగే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి జరుగుతున్న పనులు చూపించేలా ఒక వీడియోను కూడా అశ్విన్ వైష్ణవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘Make in India’ powers the Bullet Train project.
Installation of overhead electrification masts is progressing well on the Mumbai–Ahmedabad Bullet Train project. pic.twitter.com/cX8SnT5svm
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 19, 2026
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
