తిరిగి తెరుచుకున్న వజ్రాల పరిశ్రమలు
భారత్‌లో వజ్రాల ఉత్పత్తి మళ్లీ మొదలైంది. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా మూతపడిన సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి.

భారత్‌లో వజ్రాల ఉత్పత్తి మళ్లీ మొదలైంది. లాక్‌డౌన్ కారణంగా గత రెండు నెలలుగా మూతపడిన సూరత్‌లోని వజ్రాల పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కోవిడ్ 4.0లో పరిశ్రమలకు ఆంక్షలు సడలించటంతో వజ్రాల పరిశ్రమలలో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. పరిశ్రమల్లో పనిచేసే మొత్తం సిబ్బందిలో మూడో వంతుమందికే అధికారులు అనుమతిచ్చారు. దీంతో ఇండస్ట్రీలో పనిచేసేందుకు కొద్ది మంది ఉద్యోగులకు మాత్రమే అనుమతిస్తున్నారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన వలసకార్మికులు వారి వారి స్వస్థలాలకు వెళ్లడంతో ఉన్న కొద్ది కార్మికులతో వజ్రాల పరిశ్రమల్లో పనులు ప్రారంభించామని వజ్రాల వ్యాపారులు అంటున్నారు. అయితే తక్కువ మంది కార్మికులుండటంతో వారితో ఎక్కువ పనిగంటలు చేయించి అధిక వేతనాలు చెల్లిస్తున్నామని తెలిపారు. సూరత్‌లో వజ్రాల ఉత్పత్తి మొదలైనప్పటికీ.. ముంబైలోని బంగారు, వజ్రాల వ్యాపార సంస్థలు తెరుచుకోక పోవటంతో బిజినెస్ జరగటం లేదని తెలిపారు.