Indian Railways: సామాన్యుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయాలు.. టికెట్‌ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

Indian Railways: ప్రస్తుతం కన్ఫర్మ్ అయిన టికెట్‌పై ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే, టికెట్‌ను రద్దు చేసుకుని కొత్తది బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే వచ్చే జనవరి నాటికి ఆన్‌లైన్‌లోనే ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే సౌకర్యాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. అయితే..

Indian Railways: సామాన్యుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయాలు.. టికెట్‌ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

Updated on: Oct 15, 2025 | 9:21 AM

Indian Railways: ఇండియన్‌ రైల్వే ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముఖ్యంగా టికెట్స్‌ బుకింగ్‌లో నియమ నిబంధనలు మారుస్తుంది. టికెట్‌ బుకింగ్‌ విషయంలో మరింత సులభరం అయ్యే రూల్స్‌ను తీసుకువస్తోంది. రైల్వే ప్రయాణాన్ని సామాన్యులకు మరింత అందుబాటులోకి తెచ్చేందుకు, టికెట్ల జారీలో పారదర్శకత పెంచేందుకు రైల్వే శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడంతో పాటు, ఏజెంట్ల ఆధిపత్యానికి చెక్ పెడుతూ పలు కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది.

ఇది కూడా చదవండి: Auto News: దేశ ప్రజల మనస్సు దోచుకున్న బైక్‌లు.. కేవలం రూ.75వేలలోనే.. మైలేజీ మాత్రం అదుర్స్‌!

ఇకపై తత్కాల్ టికెట్లను బుక్ చేసుకోవాలంటే ఆధార్ అథెంటికేషన్, కేవైసీ తప్పనిసరి చేసింది రైల్వే. జులై 1 నుంచి ఈ విధానం అమలులోకి రాగా, జులై 15 నుంచి ఆధార్ ఓటీపీని కూడా ప్రవేశపెట్టారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్ యాప్‌లో నిజమైన ప్రయాణికులకు మాత్రమే టికెట్లు దక్కేలా చర్యలు చేపడుతోంది. ఈ మార్పులో భాగంగా, తత్కాల్ బుకింగ్ ప్రారంభమైన తొలి అరగంట పాటు అధీకృత ఏజెంట్లు టికెట్లు బుక్ చేయకుండా నిబంధన విధించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో షాకిస్తున్న బంగారం ధరలు.. తులం ధర ఎంతో తెలుసా?

60 రోజుల్లోనే అడ్వాన్స్ బుకింగ్..

కేవలం తత్కాల్ మాత్రమే కాకుండా, సాధారణ రిజర్వేషన్ ప్రక్రియలోనూ రైల్వేశాఖ మార్పులు చేసింది. ముందస్తు రిజర్వేషన్ గడువును 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించింది. అంతేకాకుండా, అక్టోబర్ 1 నుంచి సాధారణ టికెట్ల బుకింగ్ ప్రారంభమైన మొదటి 15 నిమిషాల్లో కేవలం ఆధార్ వెరిఫైడ్ ఖాతాలకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు రైల్వే శాఖ అధికారులు.

ఇది కూడా చదవండి: BSNL Annual Plan: ఈ చౌకైన రీఛార్జ్‌తో ఏడాది పాటు వ్యాలిడిటీ.. అక్టోబర్‌ 15 వరకు మాత్రమే.. మిస్‌ కాకండి!

అలాగే రైల్వే చార్ట్ విషయంలో కూడా రైల్వే శాఖ మార్పులు చేసింది. గతంలో రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు చార్ట్ సిద్ధం చేసేవారు. ఇప్పుడు 8 గంటల ముందే దీనిని పూర్తి చేస్తున్నారు. దీనివల్ల టికెట్ ఖరారు కాని ప్రయాణికులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి తగినంత సమయం లభిస్తుందనే ఉద్దేశంలో ఈ నిబంధనను తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రైల్వే అడుగులు వేస్తోంది. ప్రస్తుతం కన్ఫర్మ్ అయిన టికెట్‌పై ప్రయాణ తేదీని మార్చుకోవాలంటే, టికెట్‌ను రద్దు చేసుకుని కొత్తది బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే వచ్చే జనవరి నాటికి ఆన్‌లైన్‌లోనే ఉచితంగా ప్రయాణ తేదీని మార్చుకునే సౌకర్యాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. అయితే ఈ అవకాశం టికెట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి