Indian Railways: గడియారాల విషయంలో భారత రైల్వేల ఆసక్తికర పోటీ.. విన్నర్ నమ్మలేని గిఫ్ట్..!

భారతదేశంలో చవకైన ప్రజా రవాణా సాధనంగా రైల్వే ప్రయాణాన్ని ప్రజలు ఎంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దూరప్రాంత ప్రయాణాలకు ప్రజలు రైలునే ఆశ్రయిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు సేవలను అందించేందుకు దేశంలో చాలా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే ఈ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన వెంటనే డిజిటల్ గడియారాలు ప్రజలు కనిపిస్తూ ఉంటాయి. ఏళ్లుగా ఈ డిజిటల్ గడియారాలు సేవలు అందిస్తున్నాయి. తాజాగా వీటిని అప్‌డేట్ చేసేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.

Indian Railways: గడియారాల విషయంలో భారత రైల్వేల ఆసక్తికర పోటీ.. విన్నర్ నమ్మలేని గిఫ్ట్..!
Clock

Updated on: May 04, 2025 | 7:00 PM

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లలో కొత్త డిజిటల్ గడియారాలను ఏర్పాటు చేయడానికి డిజైన్లను ఆహ్వానిస్తూ భారత రైల్వేలు దేశవ్యాప్తంగా ఒక ఆసక్తికర పోటీని ప్రారంభించింది. రైల్వే స్టేషన్స్‌లోని ప్లాట్‌ఫారమ్‌లు, స్టేషన్ ప్రాంగణాల్లో ఉపయోగించే డిజిటల్ గడియారాలకు ఏకరూపతను తీసుకురావడమే లక్ష్యం భారత రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. భారతదేశం నివసించే వారు మాత్రమే ఈ పోటీకు అర్హులు. ఈ పోటీను మూడు విభాగాలుగా విభజించారు. నిపుణులు, కళాశాల విద్యార్థులు, విశ్వవిద్యాలయ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు. మొత్తం మీద ఉత్తమ డిజైన్‌కు రూ.5 లక్షల నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. 

ప్రతి విభాగంలో పాల్గొనేవారికి ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.50,000 విలువైన కన్సోలేషన్ బహుమతులు అందిస్తామని ప్రకటించింది. రైల్వే మౌలిక సదుపాయాల రూపకల్పనలో స్థిరత్వాన్ని మెరుగుపరచడమే కాకుండా ప్రజా వినియోగ సేవలకు సృజనాత్మకంగా తోడ్పడటంలో యువతను భాగస్వామ్యం చేయాలనే లక్ష్యంతో ఈ పోటీను నిర్వహిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఆసక్తి ఉన్న వ్యక్తులు  మే 31 లోపు contest.pr@rb.railnet.gov.in కు తమ డిజైన్లను సమర్పించవచ్చు.

ఈ పోటీపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇన్ఫర్మేషన్ & పబ్లిసిటీ) దిలీప్ కుమార్ మాట్లాడుతూ సమర్పించిన అన్ని డిజైన్లు అసలైనవిగా, ఎటువంటి కాపీరైట్ ఉల్లంఘనలకు గురికాకుండా ఉండాలని పేర్కొన్నారు. పోటీలో పాల్గొనే పాఠశాల విద్యార్థులకు చెల్లుబాటు అయ్యే పాఠశాల గుర్తింపు అవసరమని స్పష్టం చేశారు. కళాశాల విద్యార్థులు కూడా తమ ఐడీ కార్డును సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రొఫెషనల్స్ మాత్రం భారత ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులను అందించాల్సి ఉంటుందని వివరించారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి